- Telugu News Photo Gallery Cinema photos Soundarya inder thakur to taruni sachdev These celebs died in a plane crash
Airplane crash: ఈ సినీ తారల చివరి ప్రయాణం విమానంలోనే.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యాక్టర్స్..
గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం విషాదం మిగిల్చింది. ఒక్కరు మినహా విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు సిబ్బంది అందరూ మృతి చెందారు. అయితే ఇలాంటి విమాన ప్రమాదంలో కొంతమంది సిని తారలు మరణించారు. ఒకరు అయితే తన పుట్టిన రోజునే మరణించడం అతి పెద్ద విషాదం. సినీ ప్రపంచంలో చాలా మంది తారల మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా మంది నటులు విమాన ప్రమాదంలో మరణించారు. అటువంటి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు తారల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..
Updated on: Jun 13, 2025 | 9:38 AM

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో చాలా మంది మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందారు. కాగా గతంలో విమాన ప్రమాదంలో కొంతమంది సినీ ప్రముఖులు కూడా మరణించారు. ఈ మృతుల్లో సహజ నటి సౌందర్య కూడా ఒకరు. ఈ రోజు విమాన ప్రమదంలో మరణించిన సిని నటుల గురించి తెలుసుకుందాం..

తెలుగు, తమిళ, కన్నడ వంటి దక్షినాది సినిమాల్లో మాత్రమే కాదు బాలీవుడ్ సినిమాల్లో నటించిన మెప్పించిన హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న సౌందర్య బిజెపి అభ్యర్థి తరపున కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం చేయడానికి హెలికాప్టర్‌లో వెళుతుండగా.. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.అప్పుడు సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాల వయసు.. మాత్రమే. సౌందర్య చిన్న వయసులోనే మరణించింది.

'నదియా కే పార్' బాలీవుడ్ లో గొప్ప సినిమాల్లో ఒకటి. 1982 లో విడుదలైన ఈ చిత్రంలో సచిన్ పిల్గావ్కర్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. నటుడు ఇంద్ర ఠాకూర్ అతని అన్నయ్య పాత్రను పోషించారు. 1985 జూన్ 23 న ఇందర్ ఠాకూర్ తన భార్య, బిడ్డతో ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఎయిర్ ఇండియా కనిష్క-182 విమాన ప్రమాదంలో నటుడు మరణించాడు. ఈ విమానాన్ని ఉగ్రవాదులు బాంబుతో పేల్చివేశారని చెబుతారు. అప్పుడు ఇంద్ర ఠాకూర్ వయసు 35 సంవత్సరాల వయసు మాత్రమే.

నటి తరుణి సచ్‌దేవ్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'పా' చిత్రంలో పనిచేసింది. తరుణి తన 14వ పుట్టినరోజు సందర్భంగా ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఆమె మే 2012లో నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. తరుణి తల్లి కూడా మరణించింది. ఆ సమయంలో తరుణి వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే.

రాణి చంద్ర మలయాళ సినిమాకి చెందిన ప్రసిద్ధ నటి. ఆమె 1976 లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 171 కూలిపోయినప్పుడు మరణించింది. ఈ విమాన ప్రమాదంలో రాణి చంద్ర మాత్రమే కాదు ఆమె తల్లి, ముగ్గురు సోదరీమణులు కూడా ఈ ప్రమాదంలో ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

2001 ఆగస్టు 25న సెస్నా విమానం చాలా బరువుగా ఉండటం వల్ల టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఆ సమయంలో విమానం బహామాస్‌లోని అబాకో ద్వీపంలో ఉంది. నటి అలియా కేవలం 22 సంవత్సరాల వయసులో ఈ ప్రమాదంలో మరణించింది.




