- Telugu News Photo Gallery Cinema photos Tollywood senior heroes like chiranjeevi balakrishna nagarjuna doing continues movie than young heroes
కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్న సీనియర్స్
సీనియర్ హీరోలు స్పీడు పెంచారు. ఏదో అడపాదడపా సినిమాలు చేయటం కాకుండా... కుర్ర హీరోలకు పోటి ఇచ్చే రేంజ్‌లో సీరియస్‌గా కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కథ ఎంపిక నుంచి సినిమా స్పాన్, జానర్ ఇలా అన్ని విషయాల్లోనూ మాకు మాత్రం ఏం తక్కువ అన్నట్టుగా దూసుకుపోతున్నారు. దీంతో టాలీవుడ్ స్క్రీన్ మీద సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఫైట్ గట్టిగా కనిపిస్తోంది.
Updated on: Jun 12, 2025 | 8:15 PM

పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న యంగ్ జనరేషన్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నా... సీనియర్ హీరోలు మాత్రం జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్‌లో పెట్టేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.

చిరంజీవి, బాలయ్య ఈ విషయంలో మరింత అడ్వాన్స్‌గా ఉన్నారు. విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్న చిరు... ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బాలయ్య కూడా అంతే స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. అఖండ 2 షూట్‌లో పాల్గొంటూనే, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో భారీ హిస్టారికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రీసెంట్‌గా సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న వెంకీ... నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

సోలోగా సినిమాలు చేయకపోయినా... నాగ్ కూడా బిజీగానే ఉన్నారు. ధనుష్‌తో కలిసి నటించిన కుబేరా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరో వైపు రజనీ కూలీ మూవీలో గెస్ట్ రోల్ చేశారు. తన వందో సినిమా కోసం బిగ్ ప్లాన్స్‌లో ఉన్నారు కింగ్. ఇలా సీనియర్స్ అంతా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తున్నారు.




