తెలుగు తెరపై కాంతార బ్యూటీ..ఈ అమ్మడుకు లక్కు కలిసొస్తుందా?
కన్నడ ముద్దుగుమ్మలు తెలుగు తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. కన్నడలో హిట్స్ అందుకొని టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి ఇక్కడ వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా తమ సత్తా చాటుకుంటున్నారు. ఇలా అలనాటి సౌందర్య నంచి నేటి నేషనల్ క్రష్ రష్మిక వరకు చాలా మంది హీరోయిన్స్ తమ కెరీర్‌ను ఓ మలుపు తిప్పుకున్నారు. మరి ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా తెలుగులో తన అదృష్టపరీక్షించుకోవడానికి రెడీ అయిపోయింది. మరి ఈ అమ్మడుకు తెలుగు తెర కలిసి వస్తుందో లేదా.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో చూద్దాం పదండి!
Updated on: Jun 13, 2025 | 12:38 PM

టాలీవుడ్‌లోకి ఎంతో మంది బ్యూటీస్ అడుగు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది భామలు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో సౌందర్య కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచే వచ్చింది. తన ఆకర్షణీయమైన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొని, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటింది.

ఇక తర్వాత ఎంతో మంది నటీమణులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మరీ ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తాను చాటుతూ.. స్టార్ హీరోయిన్‌గా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది.

ఇక రీసెంట్‌గా అందరికళ్లు అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టిపై పడ్డాయి. ఈ బ్యూటీ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేజీ ఎఫ్ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, తన గ్లామర్‌తో తెలుగు వారి మనసు దోచుకుంది. ఇక ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లోకి అడుగు పెడుతుందా అని అందరూ ఎదురు చూడగా, రీసెంట్‌గా నిర్మాత, నేచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఈ అమ్మడు కాస్త కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మరో ముద్దుగుమ్మ కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఇంతకీ ఆ చిన్నది ఎవరు అంటే? కాంతార సినిమాతో అందరి మది దోచుకున్న ముద్దుగుమ్మ సప్తమీ గౌడ.

ఈ బ్యూటీ నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తమ్ముడు సినిమా జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ మూవీతో కాంతార నటి హిట్ కొడుతుందా. టాలీవుడ్‌లో తన సత్తాచాటుతుందో లేదో చూడాలి అంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్.



