అలసటను తగ్గించే ఐదు అద్భుతమైన యోగాసనాలు ఇవే !
ప్రతి రోజూ యోగా చేయడం వలన చాలా లాభాలు ఉన్నాయంటారు పెద్దవారు. అందుకే ప్రతి ఒక్కరు కనీసం ఉదయం కొద్దిసేపైనా యోగా చేయాలని సూచిస్తారు. కాగా, ఇప్పుడు మనం అలసట నుంచి బయటపడటానికి ఎలాంటి యోగాసనాలు వేయాలో, నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
Updated on: Jun 13, 2025 | 12:38 PM

ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక కొంత మందికి శారీరక శ్రమ లేకపోవడం వలన అనేక సమస్యల బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా వ్యాధులు, మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసట వంటివి ఎక్కువ అవుతున్నాయి. అందుకే తప్పకుండా యోగాసనాలతో మీ శరీరాన్ని మీరు కాపాడుకోని, ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు యోగానిపుణులు. కాగా, అలసట నుంచి బయటపడటానికి ఎలాంటి ఆసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యోగా నిద్ర : ఇది మనసుకు చాలా ప్రశాంతతను, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. అందుకే తప్పకుండా రోజులో ఒకసారి ఈ ఆసనం వేయాలంట. దీనిని ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేయడం వలన నిద్రనాణ్యత మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, మానసికంగా దృఢంగా ఉంటారంట. అయితే దీనిని ఎలా వేయాలంటే? నిశ్శబ్ధంగా పడుకొని, కళ్లు మూసుకొని, నిదానంగా, లోతుగా శ్వాస తీసుకోవాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు చేయకుండా శ్వాసపైన మాత్రమే ఫోకస్ పెట్టాలంట.

బాలాసన : బాలాసన వలన అలసట దూరమైన శారీరకం, మానసికంగా దృఢంగా ఉంటారు. అంతేకాకుండా శరీరం చాలా తేలికగా, ఏదో బరువు దిగిపోయినట్లుగా అనిపిస్తుందంట. దీనిని ఎలా వేయాలంటే. వజ్రాసనంలో కూర్చొని, చేతులు వెనక్కి పెట్టి, ముందుకు శ్వాస వదులుతూ ముందు వంగి తలను నేలకు వంచాలి. పాదాలు చేతుల ఒకే వైపు నేల మీద ఉండాలి. ప్రతి రోజూ ఇలా చేయడం వలన కాళ్ల నొప్పులు, నడుము నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందంట.

కపాలభాతి ఆసనం : ఈ ఆసనం వేయడం వలన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆందోళన, అలసట దూరం అవుతుంది. అయితే ఈ ఆసనం ఎలా వేయాలి అంటే? కూర్చునే భంగిమలో కూర్చొని, వీపు నిటారుగా పెట్టి, శ్వాసను తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. ఇలా 60 సార్లు చేయడం వలన చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

సంచలిత్ మర్ఘరి ఆసనం : ఈ ఆసనం ప్రతి రోజూ 10 నిమిషాల పాటు వేయడం వలన వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, మెడ నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలగుతుందంట. అలాగే అలసట తగ్గుతుందంట. దీనిని వీపు నేలకు సమాంతంరంగా పెట్టి భుజాల వెడల్పుదూరంలో ఉంచాలి. రెండు కాళ్లు ముడుచుకిని ఉంచాలంట.



















