Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ముఖం పున్నమి వెన్నెల్లా మెరిసిపోవాలా.. పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ అప్లై చేయండి.. ఎలా చేసుకోవాలంటే..

ప్రకాశవంతమైన, శుభ్రమైన చర్మం, ముఖం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దీనికోసం ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు లేదా పార్లర్ లో చికిత్స తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో ఇంటి లో ఉన్న వస్తువులతోనే చిన్న చిన్న టిప్స్ ని పాటిస్తారు. ఇవి సహజమైన పదార్ధాలతో చేసేవి కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నమ్మదగినవి, ప్రభావవంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు ముఖానికి మెరుపుని ఇచ్చే చార్ కోల్ మాస్క్ ని ఇంట్లో ఉన్న ఒకే ఒక్క వస్తువుతో చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..

Beauty Tips: ముఖం పున్నమి వెన్నెల్లా మెరిసిపోవాలా.. పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ అప్లై చేయండి.. ఎలా చేసుకోవాలంటే..
Turmeric Charcoal Facial Mask
Surya Kala
|

Updated on: Jun 13, 2025 | 12:44 PM

Share

నేటి బిజీ జీవితంలో పెరుగుతున్న కాలుష్యం, తప్పుడు జీవనశైలి ప్రభావం మొదట మన ముఖంపై కనిపిస్తుంది. ముఖం రంగు మారిపోతుంది. చర్మం మీద రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం నిర్జీవంగా కనిపించడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో కొంతమంది పార్లర్‌కు వెళ్లి చికిత్స పొందుతారు. మరికొందరు చార్‌కోల్ మాస్క్‌ను ఉపయోగిస్తారు. చార్‌కోల్ మాస్క్ ముఖం మురికిని శుభ్రపరుస్తుంది. ఛాయను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అనేక బ్రాండ్‌ల చార్‌కోల్ మాస్క్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ.. మీరు కోరుకుంటే వంటగదిలో ఉన్న పసుపుతో ఇంట్లో తయారు చేసుకోవచ్చు.

అవును పసుపు ముఖానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అలాగే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది ముఖ మొటిమలను తొలగించడంలో, చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో పసుపుతో చార్‌కోల్ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

పసుపుతో చార్‌కోల్ మాస్క్ తయారీకి కావలసిన పదార్ధాలు

పచ్చి పసుపు పొడి 2 లేదా 3 స్పూన్లు లేదా పచ్చి పసుపు కొమ్ములు 2 లేదా 3

ఇవి కూడా చదవండి

టమోటా రసం

తేనె

కాపీ పౌడర్

ఇనుప గిన్నె

తయారు చేసే విధానం

ముందుగా పచ్చి పసుపు కొమ్ములను బాగా కడిగి ఆరబెట్టండి. ఇప్పుడు దానిని ఇనుప పాన్ మీద లేదా మట్టి పాన్ లో వేసి తక్కువ మంట మీద పెట్టండి. పసుపు నెమ్మదిగా వేయించడం మొదలు పెట్టండి. క్రమంగా పసుపు రంగు మారుతూ ఉంటుంది. ఇలా పసుపు పూర్తిగా నల్లగా మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పసుపు కొన్ని చల్లబరిచి మిక్సీ లో లేదా గ్రైండింగ్ స్టోన్ మీద మెత్తగా పొడి చేసుకోండి. ఇలా పసుపు కొమ్ములకు బదులుగా పసుపు పొడిని కూడా తీసుకోవచ్చు. దీని తరువాత ఇలా నల్లగా అయిన పసుపు పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని.. అది చల్లబడిన తర్వాత తేనె, టమోటా రసం, కాఫీ పొడిని కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి.

చార్‌కోల్ మాస్క్‌ను ఎలా అప్లై చేయాలంటే

ముందుగా మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత తయారుచేసిన మాస్క్‌ను ముఖం, మెడ అంతటా అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆపై సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్ళు, మొత్తం శరీరానికి కూడా అప్లై చేయవచ్చు. ఇది చర్మం నుంచి మృత కణాలను తొలగిస్తుంది. చర్మం లోపల పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది. ఈ చార్‌కోల్ మాస్క్‌ను తొలగించిన తర్వాత మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మర్చిపోవద్దు.

పసుపుతో చేసిన చార్‌కోల్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

పసుపు బొగ్గు మాస్క్ చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికి, నూనె, మృతకణాల చర్మాన్ని తొలగిస్తుంది. ఇది ముఖాన్ని శుభ్రంగా, తేలికగా, తాజాగా చేస్తుంది. అదే సమయంలో ఈ మాస్క్ చర్మం తెరిచి ఉన్న రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని బయటకు తీస్తుంది. దీని కారణంగా బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి. పసుపులో బ్యాక్టీరియాను చంపే, వాపును తగ్గించే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్యను అదుపులో ఉంచుతుంది. ఇది చర్మపు రంగును మెరుగుపరచడంలో, చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. చర్మం చాలా జిడ్డుగా ఉంటే.. ఈ మాస్క్ అదనపు నూనెను పీల్చుకోవడం ద్వారా చర్మాన్ని సమతుల్యం చేస్తుంది. దీని కారణంగా ముఖం చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. చర్మం పూర్తిగా శుభ్రంగా ఉన్నప్పుడు సహజమైన మెరుపు కూడా వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)