Badwel by Poll Result: బద్వేలులో వైసీపీకి భారీ మెజార్టీ ఎలా వచ్చింది.. అధికార పార్టీ ఘన విజయం వెనుక అసలు కారణం అదేనా..?
Badwel by Poll 2021 Result: బద్వేల్‌లో వైసీపీకి భారీ మెజార్టీ ఎలా వచ్చింది ? ఏ కారణాలతో ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు? ఉప ఎన్నికల్లో పోటీపై ప్రతిపక్షాలు చివరి వరకు డైలమాలో పడటమే కారణమా ?
Badwel by Election Result 2021: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికను వైసీపీ తేలిగ్గా తీసుకోలేదు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార పార్టీ వైసీపీ కేడర్ పనిచేసింది. అన్ని వర్గాలను కలుపుకుని వైసీపీ నేతలు భారీ విజయం కోసం కృషి చేశారు. ఎక్కడ కూడా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.
అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారానికి వెళ్లకపోయినా ప్రతి కుటుంబానికి లేఖ రాశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను వివరిస్తూ ప్రజల ఆశీస్సులు కావాలని సీఎం లేఖలో కోరారు.
అటు టీడీపీ మొదట పోటీ చేస్తామని అభ్యర్థి పేరు ప్రకటించి, ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంది. అటు, జనసేన పోటీ చేయడం లేదని చెబుతూనే బీజేపీకి మద్దతు ప్రకటించింది. దీంతో బీజేపీ పోటీ చేసినా, ఓటర్లు వైసీపీ వైపుకే మొగ్గు చూపారు. దీంతో ప్రత్యక్షంగా జనసేన, పరోక్షంగా టీడీపీ బద్వేల్‌లో బీజేపీకి మద్దతు తెలిపినా, వైసీపీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
చివరి వరకు మిగతా పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీపై డైలమాలో పడటంతో వైసీపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. దీంతో 90 వేల 590 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి సుధ. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ భారీగా ఓట్ల శాతాన్ని రాబట్టింది.
Read Also… Badvel By Election: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీదే నైతిక విజయంః పనతల సురేష్