Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త డ్రస్‌ కోడ్‌.. మండిపడుతున్న మహిళా వైద్యులు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పనిసరిగా డ్రస్‌ కోడ్‌ పాటించాలని ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్త డ్రస్‌ కోడ్‌.. మండిపడుతున్న మహిళా వైద్యులు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 02, 2021 | 1:09 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పనిసరిగా డ్రస్‌ కోడ్‌ పాటించాలని ఉత్తర్వులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం నుంచే డ్రస్‌కోడ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం మహిళా వైద్యులు స్టెతస్కోప్‌ , ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్‌, ముదురు నీలం రంగు ట్యాగ్ తో కూడిన గుర్తింపు కార్డు, పేరు, హోదా, ఐడీ నంబర్‌తో కూడిన బ్యాడ్జ్ ధరించాలి. ఇక పురుషులు స్టెతస్కోప్‌, ఫుల్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్‌ వేసుకోవాలి. అదేవిధంగా ముదురు నీలం రంగు ట్యాగ్, బ్యాడ్జ్‌ తో కూడిన ఐడీ కార్డ్ ధరించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

మహిళా వైద్యుల ఆగ్రహం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారికి ఇలా డ్రస్‌ కోడ్‌ విధించడంపై కొందరు మహిళా వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టాఫ్‌ నర్సులు,సహాయక నర్సులు, ఆశా వర్కర్లు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుష వైద్యులకు లేని డ్ర స్‌ కోడ్‌ తమకెందుకంటూ కోప్పడుతున్నారు. విధుల్లో ఉన్నప్పుడు తాము ఫుల్ స్లీవ్ వైట్ ఆప్రాన్ ధరిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా శారీ, పంజాబీ డ్రస్‌లపై కూడా నిబంధనలు విధించడం దారుణమంటున్నారు. డ్రస్ కోడ్ నిబంధనలన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా నర్సులకు ఒకే డ్రస్‌ కోడ్‌…? కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం హెడ్ నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది తెల్లటి టోపీ, రెడ్ స్ట్రిప్ ఐడీ కార్డ్‌ సహా హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. స్టాఫ్ నర్సులు ఐడీ కార్డ్ , కలర్ ట్యాగ్‌తో కూడిన హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. ఫార్మసిస్టులు కూడా ఐడీ కార్డ్ , స్కై బ్లూ కలర్ ట్యాగ్‌ హాఫ్ స్లీవ్ వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. ల్యాబ్ టెక్నీషియన్లు ఐడీ కార్డ్, వైట్ కలర్ ట్యాగ్‌, వైట్ కలర్ ఆప్రాన్ ధరించాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుప్రతుల్లో పనిచేస్తున్న నర్సులకు ఒకే రకమైన డ్రస్‌ కోడ్‌ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు గాను రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గతేడాది భారత నర్సింగ్‌ కౌన్సిల్‌కు లేఖ కూడా రాసింది. ఇందులో భాగంగా డ్రస్‌ కోడ్‌పై అభిప్రాయాలను తెలపాలంటూ మార్చి 23న నర్సింగ్‌ కౌన్సిల్‌ జాయింట్‌ సెక్రటరీ లేఖ వివిధ రాష్ట్రాల వైద్య విద్య డైరెక్టర్లకు లేఖలు రాశారు.

Also Read:

Raghuveera Reddy: మాజీ మంత్రి రఘువీరా.. ఏంటిలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

Pawan Kalyan vs Kodali Nani: చనిపోయిన పార్టీ మాకు డెడ్ లైన్లు పెట్టడమేంటి..? పవన్ వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని కౌంటర్

Badvel By Election Winner: బద్వేలులో ఫ్యాను సుడిగాలి.. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధా భారీ విజయం

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?