Raghuveera Reddy: మాజీ మంత్రి రఘువీరా.. ఏంటిలా… నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో

రఘువీరారెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన నేత. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

Raghuveera Reddy: మాజీ మంత్రి రఘువీరా.. ఏంటిలా... నెట్టింట వైరల్‌గా మారిన ఫోటో
Raghuveera Reedy
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 02, 2021 | 1:26 PM

రఘువీరారెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన నేత. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఈయనకు పేరుంది. గత కొంతకాలంగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటోన్న రఘువీరా వ్యవసాయం చేస్తూ.. సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఫోటోలు బాగా వైరలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు సతీమణితో కలిసి మోపెడ్‌పై వచ్చారు. అంతకముందు పొలంలో దమ్ము చేస్తూ కనిపించారు. తన గ్రామానికి సమీపంలోని వాగుకు గండి పడితే.. దానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక రైతులతో కలిసి ఇసుక బస్తాలు మోసారు. ఇలా రఘువీరా ఫోటోలు ఈ మధ్య కాలంలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆయన సింప్లిసిటీని నెటిజన్స్ బాగా లైక్ చేస్తున్నారు. అంతేకాదు రఘువీరా తన సొంతఊరు నీలకంఠాపురంలోని  1200 ఏళ్ల కిందటి చారిత్రక నీలకంఠేశ్వరుడి గుడి జీర్ణోద్ధరణకు ఆయన కృషి చేసి.. ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు కుటుబంతో పూర్తి సమయం గడుపుతోన్న రఘవీరారెడ్డి.. తాజాగా ఓ ఫన్నీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో రఘువీరా మనవరాలు ఆయన్ను తాడుతో స్తంభానికి కట్టేసింది. ఈ ఫొటోను రఘువీరా ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఆడుకోవడానికి తనకు టైమ్  ఇవ్వడంలేదన్న కారణంతో నా మనవరాలు ఇలా స్తంభానికి కట్టేసి శిక్ష వేసింది అంటూ సరదాగా ట్వీట్ చేశారు.  తన మనవరాలితో ఆడుకుంటూ.. తాతయ్య హోదాను ఎంతో ఎంజాయ్ చేస్తోన్న రఘువీరా.. ఆమెకు పలు అంశాలపై అవగాహన కూడా కల్పిస్తున్నారు.

Also Read: Vegetable prices: సామాన్యులకు షాక్..పెట్రోల్‌, డీజిల్‌కు పోటీగా కూరగాయలు