Badvel By Election Winner: బద్వేలులో ఫ్యాను సుడిగాలి.. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధా భారీ విజయం
Badvel By Poll Result 2021: బద్వేల్‌లో ఊహించిందే జరిగింది. సంచలనాలను ఆశించిన విపక్షాలకు నిరాశే ఎదురైంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది.
Badvel By Election Result 2021: బద్వేలులో ఊహించిందే జరిగింది. సంచలనాలను ఆశించిన విపక్షాలకు నిరాశే ఎదురైంది. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధా భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి సురేష్‌పై 90,590 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు.
బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి సుధ భారీ విజయం సాధించారు. 90,590 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. వైసీపీకి మొత్తం 1 లక్షా 11 వేల 710 ఓట్లు రాగా, బీజేపీకి 21 వేట 612 ఓట్లు లభించాయి. బద్వేల్‌లో మొత్తం 1 లక్షా 47 వేల 213 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి 1 లక్షా 12 వేల 211 ఓట్లు లభించాయి. బిజెపికి 21 వేల 678 ఓట్లు కాంగ్రెస్ కు 6 వేల 235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 వేల 635 ఓట్లు వచ్చాయి. ఇదిలావుంటే, పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి 139, బీజేపీకి 17, కాంగ్రెస్‌కు 18 ఓట్లు లభించాయి. నోటాకు 1 ఓటు వచ్చింది. దీంతో 90 వేల 590 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది.
బద్వేల్‌లో లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భారీ మెజారిటీ దిశగా వైసీపీ దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యం పెరిగిపోతూ వచ్చింది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్లు… రెండో రౌండ్‌లో 8,300 ఓట్లు… మూడో రౌండ్‌లో 7,879 ఓట్లు… నాలుగో రౌండ్‌లో 7,626 ఓట్లు… ఐదో రౌండ్‌లో 9,986 ఓట్లు… ఆరో రౌండ్‌లో 9,443 ఓట్లు… ఏడో రౌండ్‌లో 8,741 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఇదిలావుంటే, గత ఎన్నికల్లో దాసరి సుధ భర్త వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నికల్లో తన భర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్ మాత్రమే మిగిలి ఉండటంతో వైసీపీ గెలుపు లాంఛనమైపోయింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి దాసరి వెంకట సుబ్బయ్య ఈ ఏడాది మార్చి 28న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ అధిష్టానం.. బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థిగా దాసరి సుధను బరిలోకి దింపింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోగా, జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీలో నిలిపింంది.