AP Politics: రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌ సీపీ బృందం.. టీడీపీ నేతలపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. పట్టాభి అరెస్ట్‌...

AP Politics: రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌ సీపీ బృందం.. టీడీపీ నేతలపై ఫిర్యాదు
Follow us

|

Updated on: Nov 02, 2021 | 11:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. పట్టాభి అరెస్ట్‌, టీడీపీ కార్యాలయాలపై దాడుల అంశాన్ని ఆ పార్టీ నేతలు ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అంతుకుముందే వైసీపీపై ఫిర్యాదు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు చంద్రబాబు నాయుడు లేఖలు కూడా రాశారు. మరోవైపు వైసీపీ కూడా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోన్న టీడీపీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని సీఈసీని కోరింది.

తాజాగా వైఎస్సార్‌సీపీ బృందం దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ను కలిసింది. టీడీపీ నేతలు ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తు్న్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చంద్రబాబు, ఆపార్టీ నేతలే కారణమని రాష్ట్రపతికి వివరించారు. అంతకుముందు ఎంపీ గోరంట్ల మాధవ్‌ అమిత్‌షాను కలిసి టీడీపీపై ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కావాలనే సీఎంను అసభ్య పదజాలతో దూషిస్తున్నారని, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు వారిపై చర్యలు తీసుకోవాలని అమిత్‌షాకు ఓ వినతి పత్రం అందజేశారు.