Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

వయసుతో సంబంధం లేకుండా కళ్ల జోడు కామన్‌గా మారింది. ఈ బిజీ లైఫ్‌లో కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రోజుల్లో కళ్ళు సమయానికి ముందే..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Spectacle Marks Home Remedi
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 02, 2021 | 2:10 PM

Spectacle Marks Home Remedies: వయసుతో సంబంధం లేకుండా కళ్ల జోడు కామన్‌గా మారింది. ఈ బిజీ లైఫ్‌లో కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ రోజుల్లో కళ్ళు సమయానికి ముందే బలహీనపడుతున్నాయి. కొంతమందికి మొదటి నుండి కళ్ళు బలహీనంగా మారుతున్నాయి. దీని కారణంగా వారు దూరంగా లేదా సమీపంలో ఉన్న వాటిని స్పష్టంగా చూడటంలో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే కంటిచూపు తగ్గుతుందో అప్పుడే పవర్ గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో నిరంతరంగా అద్దాలు ధరించడం చాలా అవసంర. అయితే ఇలా నిత్యం అద్దాలు ధరిచండం వల్ల చాలాసార్లు ముక్కుపై నల్లటి మచ్చ వస్తుంది. ఈ కొంత ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. 

నిరంతరం అద్దాలు ధరించే వ్యక్తులు వారి ముక్కుపై ఫ్రేమ్  ఒత్తిడి కారణంగా ఈ గుర్తు ఏర్పడుతుంది. దాని కారణంగా అక్కడ చర్మం నల్లబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ డార్క్ ప్యాచ్‌ని తొలగించవచ్చని మీకు తెలుసా..? ఈ చిన్న చిట్కాల ద్వారా ఆ సమస్యకు చెక్  పెట్టవచ్చు. ఈ సంగతి తెలిస్తే మీరు ఏదైనా ఔషదం లేదా క్రీమ్‌ను పూయడం మానుకోవాలని, లేకపోతే చర్మం ముదురు రంగులోకి మారవచ్చని మేము మీకు చెప్తాము. ఈ గుర్తును తొలగించడానికి ఇంటి నివారణలను తెలుసుకుందాం-

అలోవెరా జెల్ ఉపయోగించండి

గుర్తులు ఉన్న ప్రదేశంలో అలోవెరా జెల్‌ని వేళ్లకు పట్టించి తేలికపాటి చేతులతో మసాజ్ చేయాలి. ఇలా దాదాపు 10 నిమిషాల పాటు చేసిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి.

దోసకాయ రసంతో..

దోసకాయను ఉపయోగించడం వల్ల అనేక చర్మ సమస్యలు తొలగిపోతాయి. దోసకాయ చర్మ సౌందర్యలో చాలా మేలు చేస్తుంది. ఇది ముఖంలోని మురికిని కూడా శుభ్రపరుస్తుంది. దోసకాయ ముక్కతో గుర్తు ఉన్నచోట మసాజ్ చేయండి. ఇది మాత్రమే కాదు మీరు 1 చెంచా దోసకాయ రసంలో ఒక చెంచా బంగాళాదుంప, టొమాటో రసాన్ని మిక్స్ చేసి ఆ తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మచ్చపై అప్లై చేయండి. కొద్దిసేపు ఆరనివ్వండి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. మచ్చలు, గుర్తులు, చర్మశుద్ధి సమస్య, ముడతలు మొదలైనవన్నీ తగ్గుతాయి.

బాదం పప్పుతో  మెరుపు..

బాదంపప్పులో ‘విటమిన్ ఇ’ ఉన్నందున చర్మ ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. విటమిన్ ఇ చర్మానికి పోషణనిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు 2-3 బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మరుసటి రోజు మెత్తగా పేస్ట్ చేసి, రోజ్ వాటర్, నిమ్మరసం, తేనెను అప్లై చేసి, ముక్కు, ముఖంపై అప్లై చేయాలి. దాదాపు అరగంట పాటు అలాగే ఉంచిన తర్వాత కడిగేయాలి. మీరు బాదం నూనెను మచ్చపై మసాజ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election Result Live Counting: నాలుగవ రౌండ్‌లో ఈటల రాజేందర్‌కు ఆధిక్యం.. టీఆర్ఎస్‌కు ఎన్ని ఓట్లు..

Captain vs Etela: అసలేం జరిగింది.. టీఆర్ఎస్ ఇలాఖాలో ఈటల పాగా.. కెప్టెన్‌‌కు భారీ దెబ్బ..