Winter Food Tips: శీతాకాలంలో ఈ ఆహార పదార్ధాలకు, పానీయాలకు దూరంగా ఉండండి. హెల్దీగా ప్రకృతిని ఎంజాయ్ చేయండి

Winter Food Tips: శీతాకాలం వస్తుంది.. అంటే సీజనల్ వ్యాధులను కూడా వెంట తీసుకుని వస్తుంది. అయితే ఈ చలికాలంలో మీరు సురక్షితంగా ఉండడానికి..

Winter Food Tips: శీతాకాలంలో ఈ ఆహార పదార్ధాలకు, పానీయాలకు దూరంగా ఉండండి. హెల్దీగా ప్రకృతిని ఎంజాయ్ చేయండి
Winter Food Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2021 | 3:59 PM

Winter Food Tips: శీతాకాలం వస్తుంది.. అంటే సీజనల్ వ్యాధులను కూడా వెంట తీసుకుని వస్తుంది. అయితే ఈ చలికాలంలో మీరు సురక్షితంగా ఉండడానికి కొన్ని విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో సూక్ష్మజీవులు అధికంగా విజృంభిస్తాయి. ఇక తక్కువ ఉష్ణోగ్రత ఉండడంవలన మన శరీరంలోని రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో ఏడాదిలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఈ శీతాకాలంలోనే ఎక్కువగా ఉంటుంది. కనుక అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే శీతాకాలంలో కొన్ని ఆహారపదార్ధాలను తక్కువా.. లేదా తీసుకోవడం మానేసినా ఆరోగ్యానికి మంచివి.. ఈరోజు శీతాకాలంలో అనారోగ్యానికి గురి చేసే ఆహారపదార్ధాలు లేదా.. వ్యాధుల లక్షణాలను మరింత తీవ్రం చేసే ఐదు ఆహార పదార్ధాలను గురించి తెలుసుకుందాం..

తీపి పదార్ధాలు: 

చక్కెర అధికంగా ఉండే ఆహారాలు కేక్ ,  స్వీట్స్,  నిల్వ ఉండే జ్యుసులను,  శీతల పానీయాలు వంటి వాటికీ ఈ చలికాలంలో దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇవి అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.  అవి తాగుతున్న, తింటున్నా సంతోషము కలిగినా శరీరానికి మాత్రం అనారోగ్యాన్ని మరింత కలుగజేసే విధంగా మారతాయి. రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.

నూనెలో వేయించిన పదార్ధాలు: 

శీతాకాలంలో నూనెలో వేయించిన ఆహారాన్ని ఎంత తక్కువగా తింటే అంత మంచిదని అంటున్నారు.  నూనెలో వేయించిన ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అధిక కొవ్వు పదార్ధం అనారోగ్యాన్ని కలిగించడమే కాదు.. శ్లేష్మం ఉత్పత్తిని కూడా పెంచుతుంది.

హిస్టామిన్ అధికంగా ఉండే ఆహారం: 

హిస్టామిన్ (కణజాలములు క్షీణించినప్పుడు వెలువడిన పదార్ధం) రోగనిరోధక వ్యవస్థచే తయారు చేయబడిన సమ్మేళనం.   ఈ పదార్ధం ఎక్కువగా గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, డ్రై ఫ్రూట్స్, పెరుగు వంటి  ఆహార పదార్ధాల్లో ఉంటుంది. అందుకని వి శీతాకాలంలో ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు వ్యాధి ఉన్నప్పుడు తిన్నాయా   శరీరంలో శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. ముఖ్యంగా జలుబుతో ముక్కు మూసుకుపోయి ఇబ్బంది పడుతున్న.. ఛాతి నొప్పితో బాధపడుతున్నా ఆ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంది.

పాల పదార్ధాలు: 

గొంతునొప్పి, దగ్గు , జలుబు వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు పాల ఉత్పత్తులను తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.  పాలు ,  చీజ్ వంటి పాల ఉత్పత్తులు శ్లేష్మాన్ని మరింతగా పెంచుతాయి. దీంతో అనారోగ్యం మరింత తీవమవుతుంది.

కెఫీన్ పానీయాలు: 

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ ,  ఇతర రకాల పానీయాల్లో కెఫీన్ తో పాటు డైయూరిటిక్ (మూత్ర విసర్జనను పెంచే సమ్మేళనం) ఉంటుంది. ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది. అంతేకాదు శ్లేష్మం పెరుగుతుంది . గొంతు పొడిగా మారేలా చేస్తుంది. వీటిని తీసుకోవడంవలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక శీతాకాలంలో ఈ ఐదు ఆహారపదార్ధాలకు దూరంగా ఉండదని.. మంచు దుప్పటి కప్పునే చలికాలంలోని ప్రకృతిని ఎంజాయ్ చేయండి.

Also Read:   నస్రెట్ గోక్సే కొత్త ట్రెండ్‌.. డస్ట్‌బిన్‌ కవర్‌ను టీ షర్ట్‌గా ధరించి పావురాలకు ఆహారం..