Vizag: కాషాయం ధరించిన కర్కోటకుడు.. బాలికను బంధించి చుక్కలు చూపించాడు
ఆశ్రమం..ఆశ్రయం..అరాచకం. భక్తి ముసుగులో దగుల్బాజీల లాజిక్ ఇదే. చెప్పేది శ్రీరంగనీతులు. తీసేది గోతులు. అలా డేరా బాబా మార్క్ డర్టీ పిక్చర్ ..ఇప్పుడు విశాఖకు మరక తెచ్చింది. అమ్మానాన్నలను కోల్పోయిన ఓ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు గురురూప రాక్షసుడు. కన్నింగ్ కామానంద అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

ఒకరా ఇద్దరా.. దగుల్బాజీ బాబాలు..సచ్చు సన్నాసులు ఎందరెందరో.. ఎక్కడో అక్కడ.. ఎవడో ఒకడు… భక్తి ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇట్టాంటి కంత్రీల బాటలో లేటెస్ట్‌గా కన్నింగ్ కామానంద డర్టీ పిక్చర్ బ్లాస్టయింది.. ముసుగు తొలగింది. పూర్ణానంద సరస్వతి సిగ్గు సంపూర్ణంగా పోయింది.పేరుకే జ్ఖానానంద, రామానంద ఆశ్రమ సాధు మఠం.. తెరదీస్తే… అసలు నిజం. అజ్ఞానంద, కామానంద అరాచ సచ్చు సన్నాసి మఠం.
పూర్ణానంద సరస్వతి స్వామిగా పిలవడే ఇతను విశాఖ వెంకోజీపాలెంలోని ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. పేదసాదలకు అన్నదానం, చిన్నారులకు ఆశ్రయిం కల్పిస్తూ విద్యాబుద్దులు నేర్పిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చాడు. శిష్యులతో పాటు విరాళాలు పెరిగాయి. పూర్ణానంద మతి అథోగతి బాటపట్టింది. ఆశ్రయం పేరిట ఆశ్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఇదే శాల్తీపై అత్యాచార కేసు నమోదయింది. ఇంతలోనే మరో దారుణం. విజయవాడలో బాధితురాలి ఫిర్యాదుతో విశాఖ వెంకోజిపాలెంలో అరాచకాల డొంక కదిలింది.
కన్నవాళ్లను కోల్పోయిన ఓ అమ్మాయికి పూర్ణానంద ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. అమ్మానాన్నలా ఆదరిస్తారనుకుంటే..గురు రూప రాక్షసుడి వేధింపులు ఎదురయ్యాయి ఆమెకు. రెండేళ్లు ఆ చిన్నారిపై పూర్ణానంద లైంగిక దాడికి పాల్పడ్డమే కాకుండా నిర్బంధించి హింసించేవాడ. ఎలాగోలా ఆశ్రమం నుంచి తప్పించుకుంది ఆ చిన్నారి. ఓ మహిళను ఆమెను చేరదీసింది. ఆ బిడ్డ చెప్పిన విషయాలు విని ఆ తల్లి మనసుతల్లడిల్లింది. బాధిత చిన్నారితో కలిసి విజయవాడ దిశా పీఎస్‌ను ఆశ్రయించారామె. స్పందించిన పోలీసులు వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విశాఖ పోలీసులను అలెర్ట్ చేశారు. దాంతోకన్నింగ్ పూర్ణానంద స్వామిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పూర్ణానంద స్వామీజీపై పోక్సో కేసు ఫైలయింది. CWC కమిటీ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం చాటున డర్టీ పిక్చర్ రివీలైంది. పూర్ణానంద ముసుగు తొలిగింది.అతని టార్చర్ భరించలేక కొందరు చిన్నారుల ఆశ్రమం నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. పూర్ణానందపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ స్థానికంగా వ్యక్తమవుతోంది.