Harirama Jogaiah: ముద్రగడపై మండిపడ్డ హరిరామ జోగయ్య.. పవన్‌పై అభాండాలు వేయద్దంటూ..
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు లేఖ రాయడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య మండిపడ్డారు. కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడ పై నాకు ఉన్న సదభిప్రాయం ఈ రోజు తో పోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు లేఖ రాయడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య మండిపడ్డారు. కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడ పై నాకు ఉన్న సదభిప్రాయం ఈ రోజు తో పోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘పదువులు ఆశించి కాపు సామాజిక వర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టే కొందరు కాపు నాయకులు లిస్టులో ముద్రగడ నేడు చేరినట్లు అయ్యింది. కాపులు రిజర్వేషన్ కోసం ముద్రగడ చేసిన ఉద్యమాలు చిత్త శుద్ధితో చేసినవి అని నమ్మాను. ఇప్పుడు అవి రాజకీయ లబ్ధి కోసం అని తేలిపోయింది. ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ నా పరిధిలో లేదని బీసీ లను ఆకర్షించిన సీఎం జగన్ ను ఎందుకు వ్యతిరేకించలేదు. ముద్రగడ 2019 ఎన్నికలలో తెర వెనుక వైసీపీకి మద్దతు పలికారు. జనసేన పార్టీ కి ఓట్లు పడకుండా చేశారు. కాపులు ఉద్యమం మధ్యలో రాజీనామా చేసి కాపు ఉద్యమాన్ని గంగలో కలిపింది ముద్రగడనే’ అని విమర్శలు గుప్పించారు చేగొండి.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆభాండాలు వేసి చెడగొడుతున్నారంటూ ముద్రగడపై ఫైర్ అయ్యారు హరిరామ జోగయ్య. ‘అవినీతి ఎమ్మెల్యే ద్వారంపూడి కి మద్దతుగా ముద్రగడ నిలబడటం సిగ్గు చేటు. కాకినాడలో పవన్ ను పోటీ చేసి గెలవమని సవాలు విసిరే ముందు ప్రత్తిపాడు లో నిలబడి గెలుపొంది చూపాలి. అవినీతి వైసీపీ పార్టీలో చేరి మీకు ఉన్న పరపతి చెడగొట్టుకోవద్దు.అవినీతి ముఖ్యమంత్రి జగన్ ను కాపాడేందుకు ముద్రగడ అనవసర వ్యాఖ్యలు చేయకుండా నోరుమూసుకుని కూర్చుంటే అందరూ సంతోషిస్తారు’ అని చేగొండి హరి రామజోగయ్య హితవు పలికారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..