Araku Festival Begins: అరకులో ఆదివాసి సాంస్కృతిక సంబరాలు.. ఆకట్టుకుంటున్న దింస్సా, కోలాటం వంటి ప్రదర్శనలు
పర్యాటక కేంద్రమైన అరకులోయలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన సాంస్కృతిక సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో గిరిజన సంఘం ఆధ్వర్యంలో..
ఆంధ్రా ఊటీ అరకు లోయలో ఆదివాసి సాంస్కృతిక సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు, నృత్యాలు కనువిందు చేశాయి. మూడు రోజులు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. పర్యాటక కేంద్రమైన అరకులోయలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన సాంస్కృతిక సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించడమే కాకుండా, బాహ్య ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పంతో గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోయ గిరిజన మ్యూజియంలో ఈ సంబరాలు నిర్వహిస్తోంది.
వేదికలో మొదటి రోజు దింస్సా, మోడల్ దింస్సా, గిరిజన బాలల నృత్యం, బుడియా నాటకం మయూరి దింస్సా, కోలాటం కొమ్ముకోయ తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 8వ రాష్ట్ర మహాసభలను పరిష్కరించుకొని గిరిజన సంస్కృతిక సంబరాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు గిరిజన సంఘం నాయకులు.
Reporter : Khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..