AP MLA: నటుడిగా మారిన ఏపీ ఎమ్మెల్యే.. ఆ సినిమాలో కీ రోల్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఆయన ఓ ఎమ్మెల్యే..! గతంలో మాస్టారుగా.. పోస్ట్ మాస్టారుగా విధులు నిర్వర్తించారు. అలాగే పోలీస్ శాఖలోనూ, బ్యాంకులోనూ పనిచేశారు.

ఆయన ఓ ఎమ్మెల్యే..! గతంలో మాస్టారుగా.. పోస్ట్ మాస్టారుగా విధులు నిర్వర్తించారు. అలాగే పోలీస్ శాఖలోనూ, బ్యాంకులోనూ పనిచేశారు. ఆ తరువాత కాలంలో రాజకీయాల్లో రంగ ప్రవేశంచేసి ప్రజలకు ప్రత్యక్ష సేవ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఏకంగా ప్రధానోపాధ్యాయుడిగా మారారు. ఇదేదో ఎమ్మెల్యే వృత్తిలో ఉంటూ స్కూల్ విజిట్లో భాగంగా పిల్లలకు పాఠాలు చెప్పడం కాదు.. ఏకంగా ఓ సినిమాలోనే ప్రధానోపాధ్యాయుడు పాత్ర పోషిస్తున్నారు. ఎవరా ఎమ్మెల్యే అని ఆశ్చర్యంగా ఉంది కదూ..!? ఆ విశేషాలేంటో మీరే చూడండి..!
అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ,.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా, గతంలో అనేక ప్రభుత్వ ఉద్యోగాల బాధ్యతలు నిర్వర్తించారు. పాఠశాల టీచర్, పోస్ట్ మాస్టారుగా, పోలీస్ శాఖతోపాటు బ్యాంకుల్లోనూ పనిచేశారు ఎమ్మెల్యే. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి అన్నీ వదులుకుని ప్రత్యక్షంగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. అయితే.. ప్రస్తుతం అరకు ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫల్గుణకు ఓ అవకాశం వచ్చింది. అది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం పేరుతో రూపొందిస్తున్న చిత్రం. పాత్ర కూడా ప్రధానోపాధ్యాయుడు..! అప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అనుభవంతో పాటు.. ఇప్పుడు చదువుకోలేని పేద పిల్లలకోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మవోడి పేరుతో చిత్రం కూడా కలిసిరావడంతో ఇక ఎమ్మెల్యే ఫల్గుణ వెనుదిరిగి చూడలేదు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ అమ్మఒడి చిత్రానికి డైరెక్టర్‌గా దత్తాత్రేయ వ్యవహరిస్తున్నారు. అయితే.. అమ్మఒడి పేరుతో రెండు గంటల సినిమా షూటింగ్ నిర్మిస్తున్నామని గతంలో ఎమ్మెల్యేకు చిత్రయూనిట్ చెప్పింది. దీంతో.. అవకాశముంటే అందులో తనకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరడంతో.. చిత్ర యూనిట్ ఆ మేరకు చెట్టి ఫల్గుణను ఆహ్వానించారు. తమ చిత్రంలో నటించాల్సిందిగా కోరారు. అందుకోసం ప్రధానోపాధ్యాయుడి పాత్రను ఎమ్మెల్యేకు కేటాయించారు.
అమ్మఒడి చిత్రం షూటింగ్ పాడేరు మండలం దిగుమోదపుట్టు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతుంది. స్కూలు పిల్లలు పాఠశాలకు వస్తున్నప్పుడు హెడ్‌మాస్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు సన్నివేశం షూట్ చేశారు. దీంతో పాటు తరగతిగదిలో లెక్కలు బోధిస్తున్నట్టు మరో సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రధానోపాధ్యాయుడి పాత్రలో చెట్టి ఫల్గుణ తన పాత్రకు జీవం పోసినట్టు నటిస్తూ… కనిపించారు. తనకు చిత్రంలో ప్రధానోపాధ్యాయుడిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. కాగా ఇటీవల చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ముని పాత్రలో ఓ సినిమా షూటింగ్ లో పాల్గోన్నారు.
Also Read: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్
ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత