Domestic Airlines: డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌పై పెరుగుతున్న ఫిర్యాదులు.. వీణ విధ్వాంసురాలు వీణ శ్రీవాణికి చేదు అనుభవం
ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌పై రోజురోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. దానికి కారణం.. ఆయా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యమే అంటున్నారు సెలబ్రెటీస్.

Veena Srivani Bitter Experience: ప్రాంతీయ ఎయిర్‌లైన్స్‌పై రోజురోజుకూ విమర్శలు పెరుగుతున్నాయి. దానికి కారణం.. ఆయా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యమే అంటున్నారు సెలబ్రెటీస్. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థలను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఇటీవల రాజమండ్రి ఎయిర్‌పోర్టులో షాక్‌కు గురయ్యారు వీణా విధ్వాంసురాలు శ్రీవాణి. తనతో పాటు తీసుకొచ్చిన వీణ, ఇతర సంగీత పరికరాలు లేవంటూ ఫేస్‌బుక్ లైవ్ పెట్టి మరీ ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ప్రశ్నించారు శ్రీవాణి.
మరో ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే రోజా. నాలుగు గంటల పాటు గాలిలో చక్కర్లు కొట్టించి బెంగుళూరులో దింపారని ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే. అంతేకాకుండా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారామె. ఆ ఎయిర్‌లైన్స్‌పై కేసు పెడతానని చెప్పారు రోజా. మొన్నామధ్య ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ వల్ల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ తనయుడు రైహన్.
ఎయిర్‌లైన్స్ వల్ల ఇబ్బందులు పడి, గతంలోనూ చాలామంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫ్లైట్ జర్నీలో గతంలో విలువైన సూట్‌కేస్ పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేసింది సోనాక్షి సిన్హా. టీడీపీ మాజీ ఎంపీ దివాకర్‌రెడ్డి కూడా గతంలో ఎయిర్‌లైన్స్ సిబ్బంది వ్యవహర శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంగనా రనౌత్ కూడా గతేఎడాది ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై సీరియస్ అయ్యారు. తన కో పాసింజర్స్ ఇబ్బంది పెడుతున్నా, ఫ్లైట్ సిబ్బంది ఎ మాత్రం నిలువరించలేకపోయాలని అరోపించారామె.
VIPల సంగతే ఇలా ఉంటే, ఇక కామన్ పీపుల్ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. నిర్లక్ష్యంగా ఉంటున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Also… Ayodhya Land Scam: ఆయోధ్య రాములోరి చుట్టూ రాజకీయం.. ల్యాండ్ స్కామ్‌పై పేలుతున్న డైలాగ్‌డైనమేట్లు!




