AP weather report: ఏపీలో రాబోయే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది… ఆ ప్రాంతాలలో వర్షాలు

అల్పపీడనం పశ్చిమ - వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రానున్న 12 గంటల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరం దగ్గర అల్పపీడనంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

AP weather report: ఏపీలో రాబోయే 3 రోజులు వాతావరణం ఇలా ఉంటుంది... ఆ ప్రాంతాలలో వర్షాలు
Ap Weather
Follow us

|

Updated on: Sep 12, 2021 | 7:18 PM

నిన్నటి అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయువ్య, పశ్చిమ, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంపు తిరిగి ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ – వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రానున్న 12 గంటల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరం దగ్గర అల్పపీడనంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.  తరువాత 2,3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ————————————————— ఈరోజు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం అనగా ఉత్తర కోస్తాఆంధ్ర తీరము వెంబడి పెను గాలులు 45 నుంచి 55 కి.మీవే గంతో గరిష్టముగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశము ఉంటుంది. రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంఅనగా ఉత్తర కోస్తాఆంధ్ర తీరం తీరము వెంబడి పెను గాలులు 45 నుంచి 55 కి.మీవేగంతో గరిష్టముగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశము ఉంటుందిఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బంగాళాఖాతము మరియు దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంఅనగా ఉత్తర కోస్తాఆంధ్ర తీరం తీరము వెంబడి పెను గాలులు 45 నుంచి 55 కి.మీవేగంతో గరిష్టముగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశము ఉంటుంది

దక్షిణ కోస్తా ఆంధ్ర : —————————— ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ———————- ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు జల్లులు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

Also Read: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము.. కానీ చివరకు మాత్రం

ఆ హీరోయిన్ ఫోన్​ వాల్​పేపర్​గా నటసింహం బాలయ్య ఫొటో

టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
టాలీవుడ్ లక్కీ గర్ల్ సంయుక్త.. సమంత సలహా తీసుకున్నారా.?
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
సీఎం జగన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలనాలు.. పక్కా ప్లాన్‌తో..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే..
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు.. కేవలం 20 వేల లోపే.. అద్భుతమైన ఫీచర్స్‌
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్.. "మై డియర్ దొంగ" ట్రైలర్ విడుదల..
ఆహాలో కామెడీ ఎంటర్టైనర్..
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
ఈ ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు టీ20 ప్రపంచకప్‌లో స్థానం లేనట్లే!
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
USAలో షాప్ లిఫ్టింగ్ చేసి అడ్డంగా బుక్కయిన తెలుగు విద్యార్థినులు
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
కొండపై నుంచి పడడంతో బ్రెయిన్ డ్యామేజ్.. ఏడాదిపాటు ట్రీట్మెంట్..
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?