Nandamuri Balakrishna: ఆ హీరోయిన్ ఫోన్​ వాల్​పేపర్​గా నటసింహం బాలయ్య ఫొటో

పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను 'అఖండ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్‌లో సందడి చేయనున్నారు.

Nandamuri Balakrishna: ఆ హీరోయిన్ ఫోన్​ వాల్​పేపర్​గా నటసింహం బాలయ్య ఫొటో
Balayya
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 12, 2021 | 7:19 PM

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో నటి పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలయ్యతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి పూర్ణ తాజాగా చెప్పుకొచ్చారు. ఆయన తోటి వ్యక్తులను ఎంతో గౌరవిస్తారని, క్రమశిక్షణ కలిగిన వారని ప్రైజ్ చేశారు. బాలయ్య.. పని పట్ల ఎంతో అంకితభావంతో ఉంటారని చెప్పిన ఆమె.. ఆయన్ను ‘సింహం’గా అభివర్ణించింది. ఈ మూవీలో బాలకృష్ణ, తనకు మధ్య చాలా సన్నివేశాలు ఉన్నాయని పూర్ణ తెలిపింది. ఆయన గురించి చాలా విన్నానని.. చాలా ఇంటర్వ్యూలు చూశానని… మొదటిసారి కలిసినప్పుడు ఆయన వెంటనే లేచి ‘పూర్ణ గారు ఎలా ఉన్నారు’ అని అడిగినట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. బాలయ్య  తనతో మాట్లాడిన విధానం, ఇచ్చిన గౌరవం చూసి ఆశ్చర్యపోయానని.. తోటివారిని అంతలా గౌరవించే వ్యక్తిని ఇప్పటివరకు తాను చూడలేదని పేర్కొన్నారు.

“నా ఫోన్​ వాల్​పేపర్​గా మీ ఫొటో పెట్టుకుంటానని బాలయ్యకు చెప్పా. ప్రతిరోజు లేవగానే ఆయన ఫొటోను చూసి ఎటువంటి కంప్లైంటులు లేకుండా సింహంలా పనిచేయాలి. అసలు బాలయ్య లాంటి వ్యక్తిని ఇంత వరకు చూడలేదు. నేను కూడా ‘అది బాలేదు, ఇది బాలేదు’ అంటూ కంప్లెయింట్​ చేస్తా. కానీ ఆయన అలా కాదు. ప్రతిరోజు సెట్​కు వస్తారు. డైరెక్టర్ ఏమి చెప్పినా అలానే అంటారు. మరో మాట కూడా మాట్లాడరు. బాలయ్యతో మరిన్ని మూవీస్ చేసి, ఆయన నుంచి మరింత స్ఫూర్తిని పొందాలి.” అని పూర్ణ పేర్కొన్నారు.

Poorna

కాగా పవర్‌పుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్‌లో సందడి చేయనున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి  బ్లాక్ బాస్టర్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కలయిక నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ మూవీని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: రూ.40 వేలకే కేటీఎం, రూ.35 వేలకే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఏంటా అని ఆరా తీయగా పోలీసులు షాక్

తన కంటే 12ఏళ్ల చిన్నోడితో మహిళ అఫైర్… ఫైనల్‌గా ఊహించని విషాదాంతం