Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RC 15: రామ్ చరణ్.. శంకర్ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్.. సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్..

ప్రస్తుతం టాలీవుడ్ చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పాన్ ఇండియా

RC 15: రామ్ చరణ్.. శంకర్ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్.. సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్..
Thaman
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 3:15 PM

ప్రస్తుతం టాలీవుడ్ చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ తెగ బిజీగా గడిపేస్తున్నారు. ఇక ఇటీవల ఇతర భాషల ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్స్ సైతం తెలుగు హీరోలపై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కలయికలో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. RC15 అనే టైటిల్ వర్కింగ్‍తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుని ఘనంగా ప్రారంభమైంది. ఇక వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మ్యూజిక్ డైరెక్టర్స్‏లో థమన్ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. వరుస సినిమాలతో బిజి బిజిగా గడిపేస్తున్నాడు. తన మ్యూజిక్‏తో అటు దర్శకనిర్మాతలనే కాకుండా.. శ్రోతులను సైతం తెగ ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. థమన్ ప్రస్తుతం శంకర్, రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఆర్లీ 15 సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. గతంలో శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో థమన్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరోసారి శంకర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాడు థమన్. ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. రామ్ చరణ్, శంకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో మొత్తం 7 పాటలు ఉంటాయని… ప్రస్తుతం కాలంలో కేవలం శంకర్ సినిమాలో మాత్రమే 7 పాటలు ఉంటున్నాయని చెప్పాడు. ఇప్పటికే ఈ మూవీలోని భారీ సాంగ్ కంప్లీట్ అయ్యిందని.. మరో రెండు సాంగ్స్ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లుగా టాక్. గతంలో శంకర్ సినిమాలో ఉండే సాంగ్స్ మాదిరిగానే ఈ మూవీ పాటలు కూడా ఉండబోతున్నాయట. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి, జయరామ్, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్‏గా సర్జరీ కంప్లీట్..

Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..