Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్‏గా సర్జరీ కంప్లీట్..

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను వెంటనే

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్‏గా సర్జరీ కంప్లీట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 4:43 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను వెంటనే మాదాపూర్‏లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో మెగా అభిమానులలు ఆందోళనకు గురవుతున్నారు. అతి వేగం కారణంగానే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైనట్టు పోలీసులు తెలుపుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడ్డాడు.

ప్రమాదం తర్వాత తేజ్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఆయనకు స్నానింగ్, ఎమ్మారై స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత తల, వెన్నుముక్కకు, ఇంటర్నల్‏గా గాయాలు కాలేదని.. కేవలం కాలర్ బోన్ విరిగిందని తెలిపారు. అపోలో ఆసుపత్రి డాక్టర్ ఆలోక్ రంజన్ వైద్య బృందం తేజ్‏కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు తేజ్‏కు కాలర్ బోన్‏కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయనకు నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయిందని డాక్టర్స్ తెలిపారు.  తెలిపారు. తాజాగా తేజ్ ఆరోగ్యం పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్స్. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. అలాగే తేజ్‏కు నిర్వహించిన కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తైందని వైద్యులు తెలిపారు. త్వరలోనే తేజ్ ఆరోగ్యంకు సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

Sai Dharam Tej

Sai Dharam Tej

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నిన్నటి నుంచే సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అటు తేజ్ ప్రమాదం పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు.

Also Read: Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Heroine: ఈ ఫొటోలో ఉన్న అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.? సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో…

Lahari Shari: తేనె కళ్ళతో కైపెకించే వయ్యారి.. లేత సోయగంతో కవ్వించే సొగసరి.. ఈ లహరి