AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heroine: ఈ ఫొటోలో ఉన్న అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.? సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో…

Tollywood Heroine: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. సినీ తారలు నేరుగా తమ అభిమానులతో మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి. ఒకప్పుడు..

Heroine: ఈ ఫొటోలో ఉన్న అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.? సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో...
Narender Vaitla
|

Updated on: Sep 12, 2021 | 1:50 PM

Share

Tollywood Heroine: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య దూరం తగ్గిపోయింది. సినీ తారలు నేరుగా తమ అభిమానులతో మాట్లాడుకునే రోజులు వచ్చేశాయి. ఒకప్పుడు హీరో, హీరోయిన్ల గురించి తెలియాలంటే.. పేపర్‌లో లేదా టీవీలో వచ్చే ఇంటర్వ్యూల ఆధారంగా ఫ్యాన్స్‌ తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు తారలే నేరుగా తమను ప్రశ్నలు అడగండి అంటూ పోస్టులు పెడుతున్నారు. అభిమానులు అడిగే అన్ని రకాల ప్రశ్నలకు జవాబులు కూడా ఇస్తున్నారు.

ఇలా నిత్యం సోషల్‌ మీడియాలో బిజీగా నటీమణుల్లో అందాల తార రాశీ ఖన్నా ఒకరు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అనతికాలంలోనే తెలుగు తెరపై మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక అనతి కాలంలోనే అగ్ర కథానాయకుల సరసన ఆడిపాడిన ఈ చిన్నది మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో జోష్‌ మీదున్న ఈ చిన్నది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. వెనకాల నుంచి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసిందీ అందాల తార. ఒకానొక సమయంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ చిన్నది ప్రస్తుతం నాజుగ్గా మారింది. ప్రస్తుతం రాశీ ఖన్నా పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ఆమె అభిమానులను ఫిదా చేస్తోంది. రాశీ ఖన్నా లేటెస్ట్‌ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Indhuja Ravichandran: అందాలతో అదరగొట్టేస్తోన్న తమిళ్ బ్యూటీ ఇందుజా రవిచంద్రన్..

Prabhas: సీటీ వేసిన డార్లింగ్‌.. స్నేహితుడి విజయంపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ బైక్‌ ప్రమాదంపై ప్రెస్ నోట్ విడుదల చేసిన పోలీసులు..