Prabhas: సీటీ వేసిన డార్లింగ్‌.. స్నేహితుడి విజయంపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.

Prabhas: ప్రభాస్‌, గోపీచంద్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరు హీరోలు అడపాదడపా ఆడియో వేదికలపై చెబుతూనే ఉన్నారు. వర్షం సినిమాలో పోటాపోటీగా...

Prabhas: సీటీ వేసిన డార్లింగ్‌.. స్నేహితుడి విజయంపై ఆసక్తికర పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2021 | 11:21 AM

Prabhas: ప్రభాస్‌, గోపీచంద్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇద్దరు హీరోలు అడపాదడపా ఆడియో వేదికలపై చెబుతూనే ఉన్నారు. వర్షం సినిమాలో పోటాపోటీగా నటించిన వీరిద్దరూ తర్వాత మంచి స్నేహితులుగా మారారు. గోపీచంద్‌ తన ప్రతీ సినిమా వేడుకల్లో ప్రభాస్‌ను గుర్తుచేసుకుంటుంటారు. గోపీచంద్‌ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్‌ చిత్రం తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో నడుస్తోంది. ప్రేక్షకులకు ఈ సినిమాకు క్యూ కడుతున్నారు. నిజానికి కరోనా కారణంగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని గతంలో టాక్‌ వచ్చింది. అయితే మూవీ మేకర్స్‌ మాత్రం సినిమాను థియేటర్‌లోనే విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్‌ వస్తుండడంతో మేకర్స్‌ తీసుకున్న నిర్ణయం సరైందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన స్నేహితుడు గోపీచంద్‌ సినిమా సక్సెస్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. విజిల్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ప్రభాస్‌.. ‘సీటీమార్‌ చిత్రంతో నా ఫ్రెండ్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అదుకున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత ఫలితం గురించి కంగారులేకుండా ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన చిత్ర యూనిట్‌కు నా అభినందనలు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం ఆదిపురుష్‌ షూటింగ్‌లో భాగంగా యూకేలో ఉన్నారు.

Also Read: Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ బైక్‌ ప్రమాదంపై ప్రెస్ నోట్ విడుదల చేసిన పోలీసులు..

PF Customers: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఆ గడువు డిసెంబర్‌ 31 వరకు పొడిగింపు..!

Maa Elections 2021: స్పీడ్ పెంచిన మోనార్క్ .. మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ ప్రచారం షురూ…