Sai Dharam Tej Accident: సాయిధరమ్ తేజ్‌ను కాపాడింది నేనే.. ఆయన హీరో అని నాకు తెలియదు: అబ్దుల్ ఫర్హాన్
సినీ నటుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సరిగ్గా రాత్రి 8 గం.లకు జరిగిన ఈ ప్రమాదంలో
Sai Dharam Tej Accident: సినీ నటుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సరిగ్గా రాత్రి 8 గం.లకు జరిగిన ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సాయి ధరమ్ తేజ్‌కి జూబ్లీహిల్స్ అపోలా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. తాజాగా తేజ్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. స్పృహలోకి రావడంతో సాయిధరమ్ తేజ్ కు షోల్డర్ బోన్ సర్జరీ చేస్తున్నరు వైద్యులు. ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ టీవీ9తో మాట్లాడాడు.
అబ్దుల్ ఫర్హాన్ మాట్లాడుతూ.. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పృహు కోల్పోయాడు. మొహం పై వాటర్ చల్లిన చలనం లేదు. ఆక్సిడెంట్ జరిగిన వెంటనే డయల్ 100, 108కి కాల్ చేశా.. సాయి ధరమ్ తేజ్ మొబైల్ నుండి వారికి తెలిసిన వ్యక్తులకు కాల్ చేసే ప్రయత్నం చేశా.. మొబైల్ లాక్ ఉండటంతో జేబులేని వాలెట్ తీసా..అందులో డబ్బులు మాత్రమే ఉన్నాయి… కాంటాక్ట్స్ లేకపోవడంతో డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇచ్చా.. ఆక్సిడెంట్ కి గురైంది హీరో అని తెలియదు..రోడ్డు పై మట్టి, ఓవర్ స్పీడ్ తోనే ఆక్సిడెంట్ జరిగింది..నాకు ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ కుటుంబం నుండి ఎవరు కాల్ చేయలేదు..ఘటన జరగగానే నేను స్పందించిన తీరు పై రాయదుర్గం పోలీసులు కాల్ చేసి అభినందించారు..అని తెలిపాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :