Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై ప్రెస్ నోట్ విడుదల చేసిన పోలీసులు..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీప్రముఖులు కోరుకుంటున్నారు. తేజ్ కు ప్రమాదం జరిగిందని తెలిసి మెగా అభిమానులంతా
Sai Dharam Tej Accident: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీప్రముఖులు కోరుకుంటున్నారు. తేజ్‌కు ప్రమాదం జరిగిందని తెలిసి మెగా అభిమానులంతా ఆందోళన చెందారు. అయితే తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే వైద్యులు తెలిపారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైంది. సరిగ్గా రాత్రి 8 గం.లకు జరిగిన ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సాయి ధరమ్ తేజ్‌కి జూబ్లీహిల్స్ అపోలా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కుటుంబసభ్యులు, సినీ తారలతో పాటు మెగా అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంపై పోలీసుల ప్రెస్ నోట్ విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేశారని తెలిపారు. ఎల్బీనగర్‌కు చెందిన అనిల్‌కుమార్ అనే వ్యక్తి నుంచి బైక్ తేజ్ కొన్నాడు. అనిల్‌కుమార్‌ను పిలిచి విచారిస్తున్నాం. బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిసింది. బైక్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపాం అన్నారు. గతంలో మాదాపూర్‌లోని పర్వతాపూర్ వద్ద ఓవర్ స్పీడ్‌పై రూ.1,135 చలాన్ వేశామని..ఈ చలాన్‌ను సాయి ధరమ్ తేజ్ ఓ అభిమాని క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదం సమయంలో 72 కి.మీ. స్పీడ్‌తో వెళ్తున్నాడు. దుర్గం చెరువుపై 102 కి.మీ. వేగంతో బైక్ నడుతుపున్నారు. రాష్ డ్రైవింగ్‌తో పాటు నిర్లక్ష్యంగా బైక్‌ను నడిపారు. ఆటోను లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్ టెక్ చేయబోయి స్కిడ్‌డై కిందపడ్డాడు. తేజ్ వద్ద టూ వీలర్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ మాకు లభ్యం కాలేదు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేసే లైసెన్స్ మాత్రమే ఉంది. ప్రమాదం సమయంలో హెల్మెట్ ధరించి ఉన్నాడు. అని పోలీసులు తెలిపారు. అలాగే సాయి ధరం తేజ్ పై ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు పెట్టారు.
మరిన్ని ఇక్కడ చదవండి :