Sai Dharam Tej: తండ్రి శరీరం కాలే వరకు ఆ బాధ ఉంటుంది.. సాయి తేజ్‌ ప్రమాదంపై ఎమోషనల్‌ అయిన బాబు మోహన్‌.

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌ దుర్గం చెరువ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి క్షేమంగా..

Sai Dharam Tej: తండ్రి శరీరం కాలే వరకు ఆ బాధ ఉంటుంది.. సాయి తేజ్‌ ప్రమాదంపై ఎమోషనల్‌ అయిన బాబు మోహన్‌.
Babu
Follow us

|

Updated on: Sep 12, 2021 | 10:03 AM

Sai Dharam Tej Accident: హైదరాబాద్‌ దుర్గం చెరువ కేబుల్‌ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదం నుంచి క్షేమంగా బయట పడ్డ సాయి ప్రస్తుతం జుబ్లిహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని అందూ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదం విషయమై నటుడు బాబు మోహన్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడి మరణాన్ని గుర్తి చేసుకొని ఎమోషన్‌ అయ్యారు.

బాబు మోహన్‌ కుమారుడు స్పోర్ట్స్‌ బైక్‌ డ్రైవ్‌ చేస్తూ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రమాదంపై స్పందిస్తూ.. యాక్సిడెంట్‌లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. స‌ర‌దా కోసం ప్రాణాల‌తో ఎవ‌రు చెల‌గాటం ఆడొద్దని బాబుమోహన్‌ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో మరణించిన వారు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతీ ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని వాపోయారు.

ఇక సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని మంచి ప‌ని చేశాడన్న మోహన్‌ బాబు.. ‘కొంద‌రు హెల్మెట్ పెట్టుకోవ‌డాన్ని నామోషీలా ఫీల‌వుతారు. హెల్మెట్ లేకుండా రోడ్డుపై బైక్ నడుపుతూ థ్రిల్ ఫీల్ అయి యాక్సిడెంట్ కాగానే చతికిలపడతారు. లేకపోతే అతన్ని నమ్ముకున్న వాళ్ళు చీకట్లోకి వెళ్లిపోతారు. దీనికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ.. ఓ తండ్రి తన కళ్ల ముందు కుమారుడిని కోల్పోతే.. తండ్రి శరీరం కాలిపోయేవరకు ఆ దుఃఖం ఉంటుంది. కడుపుతీపితో వచ్చే ఆ బాధను ఎవరూ తగ్గించలేరు. దయచేసి యూత్‌ తమ కుటుంబాన్ని గుర్తు చేసుకొని బైక్‌ నడపాలి’ అంటూ బాబు మోహన్‌ ఎమోషనల్‌ అయ్యారు.

Also Read: India Coronavirus: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్.. 30 వేల దిగువకు దిగువకు కోవిడ్ కేసులు..

iPhone 13 Effect: ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 12 ధరలు.. ఎంతో తెలుసా?

Lic Housing Loan: హోమ్‌ లోన్‌ కావాలనుకునే వారికి ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్‌..!