Lic Housing Loan: హోమ్‌ లోన్‌ కావాలనుకునే వారికి ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్‌.. వారికి మాత్రమే..!

Lic Housing Loan: ప్రస్తుతం హోమ్‌ లోన్‌ కావాలంటే ఎన్నో మార్గాలున్నాయి. గతంలో ఉన్న ప్రాసెస్‌లాగా కాకుండా సులభమైన పద్దతుల్లో రుణాన్ని పొందవచ్చు...

Lic Housing Loan: హోమ్‌ లోన్‌ కావాలనుకునే వారికి ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్‌.. వారికి మాత్రమే..!
Follow us

|

Updated on: Sep 12, 2021 | 10:09 AM

Lic Housing Loan:  ప్రస్తుతం హోమ్‌ లోన్‌ కావాలంటే ఎన్నో మార్గాలున్నాయి. గతంలో ఉన్న ప్రాసెస్‌లాగా కాకుండా సులభమైన పద్దతుల్లో రుణాన్ని పొందవచ్చు. బ్యాంకుల్లోనే కాకుండా లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) నుంచి కూడా గృహ రుణం పొందవచ్చు. అయితే సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి మంచి అవకాశం ఉంటుంది. అయితే చేతిలో సరిపడ డబ్బులు లేకుండా హోమ్ లోన్ తీసుకొని ఇంటి కల నేరవేర్చుకోవాలని భావించే వారికి ఎల్‌ఐసీ సంస్థ హోమ్‌లోన్‌ అందిస్తోంది. అందుకు ఓ అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది.

లైఫ్‌ ఇన్స్‌రెన్స్‌ కార్పొరేషన్‌ ఇఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) హౌసింగ్ ఫైనాన్స్ హోమ్ లోన్స్‌పై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గిస్తోంది. అయితే ఈ బెనిఫిట్ కొందరికి మాత్రమే వర్తిస్తుంది. సిబిల్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ లభిస్తాయి. సిబిల్ స్కోర్ 700 లేదా ఆపైన ఉంటే.. వారికి వడ్డీ రేటు తగ్గుతుంది.

హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు 6.9 శాతం:

సిబిల్ స్కోర్ 700 లేదా ఆపై ఉంటే హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 6.9 శాతం నుంచి ప్రారంభం అవుతుందని. రూ.50 లక్షల వరకు రుణాలకు ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని ఎల్‌ఐసీ చెబుతోంది. అదే ఎక్కువ మొత్తంలో రుణం అయితే వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. మీరు సిబిల్ వెబ్‌సైట్‌కు వెళ్లి స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఇలా సిబిల్‌ స్కోర్‌ను బట్టి రుణాలు ఇచ్చే సంస్థలు తక్కువ వడ్డీకే లోన్స్‌ మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకుల కంటే ప్రైవేటు సంస్థలు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.

అలాగే పాలసీపై పర్సనల్‌ లోన్‌ కూడా పొందవచ్చు. ఎల్‌ఐసీలో అన్ని రకాల పాలసీలపై రుణ సౌకర్యం పొందటానికి వీలుండదు. టర్మ్, హెల్త్ ప్లాన్లపై లోన్ తీసుకోలేం. మనీ బ్యాక్, ఎండోమెంట్, యాన్యుటీ వంటి పలు రకాల పాలసీలపై లోన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీ పాలసీ సెరండర్ విలువలో 90 శాతం మొత్తం వరకే ఎల్‌ఐసీ రుణం అందిస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఆధార్ కార్డు, క్యాన్సల్ చెక్ వంటి డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంటు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే పాలసీపై లోన్ తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి.

ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం కచ్చితంగా మూడేళ్లు చెల్లించాలి ఉండాలి. కనీసం 6 నెలల టెన్యూర్‌తో లోన్ పొందాల్సి ఉంటుంది. లోన్ వడ్డీ డబ్బులను ఏడాదికి రెండు సార్లు కట్టేస్తూ రావాలి. మీరు లోన్ డబ్బులు కట్టకపోతే.. ఎల్‌ఐసీ మీ పాలసీ డబ్బుల్లో లోన్ డబ్బులను కట్ చేసుకుంటుంది. ఇకపోతే మీరు లోన్ కోసం ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వెళ్లి సంప్రదించండి.

ఇవీ కూడా చదవండి:

Chinese Spare Parts: చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం

Cooking Oil: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వంట నూనె దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..