Chinese Spare Parts: చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం

Chinese Spare Parts: దేశీయ ఐటీ, హార్డ్‌వేర్‌ పరిశ్రమకు సంబంధించి చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ..

Chinese Spare Parts: చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం
Follow us
Subhash Goud

|

Updated on: Sep 12, 2021 | 8:11 AM

Chinese Spare Parts: దేశీయ ఐటీ, హార్డ్‌వేర్‌ పరిశ్రమకు సంబంధించి చైనా విడిభాగాల కంపెనీలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనా విషయంలో కఠిన వైఖరిని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నప్పటికీ.. చైనాకు చెందిన విడిభాగాల సంస్థలు, చైనా కంపెనీల ప్రతినిధులు భారత్‌కు నిరభ్యంతరకరంగా రావచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత్‌లో చైనాకు చెందిన విడిభాగాల సంస్థలపై ఆంక్షలు విధిస్తే దేశీయ హార్డ్‌వేర్‌ పరిశ్రమకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం విజయవంతం కాదనే విషయాన్ని గుర్తించే ఐటీ హార్డ్‌వేర్‌ పరిశ్రమకు ప్రభుత్వం ఈ హామీని ఇచ్చినట్లుగా కన్పిస్తోంది.

పీసీబీఏ, బ్యాటరీ ప్యాక్స్‌, పవర్‌ అడాప్టర్‌ లాంటి హార్డ్‌వేర్‌ విడిభాగాలను భారత్‌లోకి అనుమతించకుంటే తమకు కష్టం అవుతుందని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖకు దేశీయ హార్డ్‌వేర్‌ పరిశ్రమ తెలిపింది. అయితే భారత్‌లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే పీఎల్‌ఐ పథకం ఉద్దేశం. ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకవేళ చైనా సరఫరాదారులకు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతిని ఇవ్వకుంటే.. పీఎల్‌ఐ పథకం విజయవంతంపై సందేహాలు నెలకొంటాయని తాజాగా సమర్పించిన నివేదికలో పరిశ్రమ బృందం పేర్కొంది.

అలాగే చైనా నుంచి భారత్‌కు తమ తయారీ కేంద్రాలను మార్చేందుకు తయారీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని అందులో తెలిపింది. తయారీ కేంద్రాలను భారత్‌కు మార్చేటప్పుడు చైనా టెక్నీషియన్‌లు భారత్‌కు వచ్చేందుకు వీసాలు అవసరం అవుతాయని తెలిపింది. ఈ విషయంలో భారత్‌ ఇటీవల కొన్నాళ్లుగా కఠిన వైఖరిని అనుసరిస్తున్న విషయాన్ని పరిశ్రమ గుర్తుచేసింది.

పెరిగిన ల్యాప్‌టాప్‌ల దిగుమతులు..

కాగా.. గత ఐదేళ్లలో భారత్‌కు ల్యాప్‌టాప్‌ దిగుమతులు రూ.21,707 కోట్ల నుంచి 42 శాతం పెరిగి రూ.30,771 కోట్లకు చేరాయి. ఇందులో 87 శాతం ల్యాప్‌టాప్‌లు చైనా నుంచి దిగుమతి అయినవే కావడం గమనార్హం.

ఇవీ కూడా చదవండి:

Cooking Oil: సామాన్యులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వంట నూనె దిగుమతి సుంకంలో కోత.. దిగి రానున్న ధరలు

RBI New Rules: ఖాతాదారులకు ఊరట.. ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇక నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్‌ కావు..!

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత