AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం.. ఐదు లక్షల ఉద్యోగాలే లక్ష్యంతో జగన్ సర్కార్ పర్ఫెక్ట్ ప్లాన్..

పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం..

Andhra Pradesh: పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం.. ఐదు లక్షల ఉద్యోగాలే లక్ష్యంతో జగన్ సర్కార్ పర్ఫెక్ట్ ప్లాన్..
Andhra CM Jagan Mohan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2023 | 4:56 PM

Share

పారిశ్రామిక రంగంలో విశేషమైన వృద్ధిని సాధించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని నిర్వహించనుంది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అపార అవకాశాలను (అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్) ప్రభుత్వం కల్పిస్తున్న సమృద్ధి వనరులను వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమ్మిట్‌లో, రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల బలమైన ఉనికిని, కల్పించనున్న మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను ప్రదర్శిస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చెన్నై, బెంగళూరు, ముంబైలలో అనేక రోడ్‌షోలను ప్రభుత్వం నిర్వహించింది.

ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, హెల్త్‌కేర్, మెడికల్ ఎక్విప్‌మెంట్, లాజిస్టిక్స్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్‌లు, పెట్రోలియం, ఫార్మా, పునరుత్పాదక ఇంధనం, టెక్స్‌టైల్స్, టూరిజం, హాస్పిటాలిటీ వంటి దీర్ఘకాలిక వృద్ధికి అవకాశం ఉన్న వివిధ రంగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఎంఎస్ఎంఈ రంగం గురించి మాట్లాడుతూ.. సిఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాల కల్పనకు వెన్నెదన్నుగా నిలుస్తుండటంతో పూర్తి స్థాయిలో ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

గత నాలుగు సంవత్సరాలలో వివిధ పథకాల క్రింద 3000 కోట్లకు పైగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఎంఎస్ఎంఈలకు విడుదల చేశారు. తద్వారా ఇప్పటికే ఉన్న ఎంఎస్ఎంఈల పురోగతితో పాటు 20,000 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లను సృష్టించడం, ఎంఎస్ఎంఈలలో ఐదు లక్షల కంటే ఎక్కువ కొత్త ఉద్యోగాలను సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ లెక్కల ప్రకారం, రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి, ఉద్యోగ కల్పనలో పెరుగుదల నమోదుకాగా ప్రతి ఒక్కరికీ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థకు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. మూడేళ్లలో, 37,956 ఎంఎస్ఎంఈ యూనిట్లు 60,800 యూనిట్లకు పెరిగాయి, 2019లో 4,04,939 నుండి 5,61,235 మంది పనిచేస్తున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్’ అనే రెండు పథకాలను కూడా ప్రారంభించిందని, రాబోయే రెండేళ్లలో 100 క్లస్టర్లను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాటిలో 52 క్లస్టర్లను ప్రతిపాదించామని బోర్డు పేర్కొంది. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నిలకడగా మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు విడుదల చేసిన లెక్కల ప్రకారం, 2021-22లో దేశంలో అత్యధికంగా రెండంకెల జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతంగా ఉంది. 974 కి.మీతో దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం ఏపీ సొంతం. ప్రస్తుతం ఉన్న 6 ఓడరేవులతో పాటు కొత్తగా రాబోయే నాలుగు ఓడరేవులతో ఆగ్నేయ దిశలో భారతదేశ ముఖ ద్వారం అయినందున రాష్ట్రం సముద్ర మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇది అనుకూలమైన వ్యాపార వాతావరణంతో పాటు పరిశ్రమ-కేంద్రీకృత విధానాలను కలిగి ఉంది.

దేశంలోని 11 పారిశ్రామిక కారిడార్లలో మూడింటిని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్నారు. కొన్నింటిని పేర్కొనడానికి, రాష్ట్రం లాజిస్టిక్స్ 2022 కోసం లీడ్స్ అవార్డు, ఎనర్జీ 2022 కోసం ఇనర్షియా అవార్డ్, పోర్ట్ లీడ్ కోసం ఈటీ అవార్డుతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 2022 అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది.

గత నాలుగు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, రాబోయే పెట్టుబడిదారులకు వేగవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్‌లు, సుదీర్ఘ తీరప్రాంతాలు, వివిధ రకాల ఓడరేవులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సమృద్ధిగా ఉన్న భూములు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీ ప్రభుత్వం హామీ ఇస్తుంది.

మొత్తం రూ. 2.2 లక్షల కోట్ల పెట్టుబడితో 20,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో 89 భారీ ప్రాజెక్టులు క్రియాశీలంగా రాష్ట్రంలో అమలులో ఉన్నాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..