Speaker Tammineni: రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి.. జోస్యం చెప్పిన స్పీకర్ తమ్మినేని
రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి కాబోతుందంటూ జోస్యం చెప్పారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు యాత్రలు అసమర్దుడి ఆఖరి అంతిమ యాత్ర అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సింహాం ఒంటరిగానే వెలుతుందన్నారు..
AP Speaker Tammineni: ఆంధప్రదేశ్ లో(Andhrapradesh) రెండేళ్లకు ముందే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. వైసీపీ (YCP), టీడీపీ(TDP) నేతల ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో టిడిపి పార్టీ ఆఫీస్ స్టార్ హొటల్ గా మార్చుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు తమ్మినేని. అంతేకాదు.. టీడీపీ జాతీయపార్టీ అని చెప్పుకుంటే సరిపోదని.. చంద్రబాబు తన భవిష్యత్ విజన్ క్లియర్ గా ఉంది.. ఆయన హైదరాబాద్ వదలి ఏపీకి రారని అన్నారు.
అంతేకాదు మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి ఏపీకి ప్రజలు ఇచ్చిన షాక్ కు ఆయన ఇంకా కోలుకోలేదు.. లేవలేదని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా సమాధి కాబోతుందంటూ జోస్యం చెప్పారు తమ్మినేని. చంద్రబాబు యాత్రలు అసమర్దుడి ఆఖరి అంతిమ యాత్ర అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సింహాం ఒంటరిగానే వెలుతుందన్నారు. ఇక తమ పార్టీ క్యాడర్ లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు. పండగ వాతావరణంలో ప్రభుత్వం ప్రకటించిన గడప గడపకూ వైఎస్సస్సార్ కార్యక్రమం చేపట్టబొతున్నామని.. తమలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటామని చెప్పారు.
అర్హత కలిగినవారికి సంక్షేమ పథకాలు అందకపోతే.. గడప గడపకూ వైఎస్సస్సార్ కార్యక్రమంలో సంక్షేమం అందేలా చూస్తామని తెలిపారు. ఏమీ చేయని వారు ఏవో చెప్పు కుంటున్నారు. సర్వం చేసి చెప్పుకోకపొవడం కరెక్ట్ కాదు కదా అని అన్నారు. ప్రతిపక్షాలు అపోహాలు సృష్టిస్తున్నాయని.. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్పారు. నాడు టిడిపి మ్యానిపేస్టో అమలు చేయలేక వెబ్ సైట్ నుంచి తీసేసారని గుర్తు చేస్తూనే.. తాము ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం , టంచన్ గా అందిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వసనీయతను సాధించిన వ్యక్తి సీఎం జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. గడపగడపకూ వైఎస్సాఅర్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో అధికారులంతా ప్రజల్లో ఉంటారని చెప్పారు. మేము ఈ కార్యక్రమం చేసాం అందిందా లేదా అంటూ జనం మధ్య నిలబడి చెప్పాలంటే దమ్ముండాలన్నారు స్పీకర్ తమ్మినేని.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..