AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SI Physical Events Dates 2023: రేపటి నుంచే ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్.. అధికారులు చెబుతున్న సూచనలివే..

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐల పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్‌కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల కోసం ఈనెల 25 నుంచి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 17,374 మంది అభ్యర్ధులకు ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 23 వరకు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులకు పలు సూచనలు చేసి,

AP SI Physical Events Dates 2023: రేపటి నుంచే ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్.. అధికారులు చెబుతున్న సూచనలివే..
SI Physical Events
Shiva Prajapati
|

Updated on: Aug 24, 2023 | 10:15 PM

Share

ఎప్పుడెప్పుడా అని ఎస్ఐ అభ్యర్థులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి అంటే ఆగష్టు 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 23 వరకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ, అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ.

స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐల పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్‌కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల కోసం ఈనెల 25 నుంచి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన 17,374 మంది అభ్యర్ధులకు ఆగష్టు 25 నుండి సెప్టెంబర్ 23 వరకు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారులకు పలు సూచనలు చేసి, దిశానిర్దేశం చేశారు డిఐజి హరికృష్ణ, అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ.

సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు..

దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు డిఐజి హరికృష్ణ. ఎస్ఎల్‌‌పి‌ఆర్‌బి ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అన్నారు. అభ్యర్థులు డేట్ స్లాట్ ఆధారంగా సమయానికి హాజరుకావాలని సూచించారు అధికారులు.

మహిళా అభ్యర్థులకు ఆగస్టు 30 నుంచి..

ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 2,745 మంది మహిళా అభ్యర్థులకు షెడ్యూల్ ఖరారు చేశారు అధికారులు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 2 వరకు నాలుగు రోజులు పాటు ప్రత్యేకంగా దేహదారుఢ్య పరీక్షలు జరుగుతాయని చెప్పారు పోలీసు అధికారులు. ఈ ఫిజికల్ ఈవెంట్స్‌లో మెటాలిక్, స్పైక్ షూస్ ధరించి రావద్దని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.

ఉదయం 5 గంటలకే..

దేహాదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వారికి కేటాయించిన తేదీలలోనే రావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం 5 గంటలకు కాల్ లెటర్, నోటిఫికేషన్లో సూచించిన విధంగా స్టేజ్ టు ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అన్నారు. విశాఖపట్నం కైలాసగిరి ఏఆర్ పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల కోసం నిర్ణీత సమయంలో అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..