ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదు.. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలను సహించంః ఎస్ఈసీ నిమ్మగడ్డ

రాజ్యాంగ బద్దంగానే ఏపీ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదు.. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలను సహించంః ఎస్ఈసీ నిమ్మగడ్డ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 12:12 PM

AP SEC Press Meet : కడప జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యల చేశారు రాష్ట్ర నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఎన్నికలు జరపకుండా ఇక తనను ఏ శక్తి అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ఏకగ్రీవాల పేరుతో గ్రామాల్లో ప్రచారం చేస్తే… ఇంట్లో కూర్చోబెడతామని వార్నింగ్స్‌ ఇచ్చారు.

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎన్నికలను అడ్డుకోవడానికి పెద్ద ఏత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. అందులో అడ్వకేట్‌ జనరల్‌ కూడా ఉన్నారన్నారు. అనిశ్చితి పరిస్థితుల్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, ఇక ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదని వ్యాఖ్యానించారు.

మరోవైపు, కడపలో సమీక్ష తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ. ఆయన ఆశీస్సుల వల్లే ప్రస్తుతం తానీ పరిస్థితుల్లో ఉన్నానన్నారు. వైఎస్సార్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వారని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తర్వాత జరిగిన పరిణామాలతో వచ్చిన సీబీఐ కేసుల్లో తాను ప్రధాన సాక్షినని చెప్పారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌. ఆ కేసుల్లో తాను నిర్భయంగా సాక్ష్యం చెబతానని, తనను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును తప్పుబడుతూ ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు నిమ్మగడ్డ. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాలి… పంచాయతీలకు మాత్రం ఏకగ్రీవాలు జరగాలా అని ఆయన ప్రశ్నించారు. అసాధారణంగా జరిగే ఏకగ్రీవాలపై కచ్చితంగా నిఘా పెడతామన్నారు. ఏకగ్రవాలపై గ్రామాల్లో ప్రచారం చేసే వారిని ఇంట్లో కూర్చోబెడతామని హెచ్చరించారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.

ఇది చదవండి… రాజ్యాంగం ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నాం.. పోలింగ్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండవుః ఎస్ఈసీ నిమ్మగడ్డ