AP Rain Alert: ఏపీకి మరో గండం.. 29న బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణశాఖ అలెర్ట్

Andhra Pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వెంటాడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా వరుణుడు సృష్టించిన బీభత్సాన్ని మరువక ముందే, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ

AP Rain Alert: ఏపీకి మరో గండం.. 29న బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణశాఖ అలెర్ట్
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 27, 2021 | 7:11 PM

Andhra Pradesh Weather Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వెంటాడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా వరుణుడు సృష్టించిన బీభత్సాన్ని మరువక ముందే, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. వరుణుడి నుంచి మరో ప్రమాదం దూసుకువస్తోంది. కొద్ది రోజులుగా దక్షిణాంధ్రప్రదేశ్‌ను వరుస తుఫాన్‌లు చుట్టుముడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ వరదలతో రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వసం అయ్యాయి. ఇప్పటికీ అనేక గ్రామాలు వరద ముంపులోనే మగ్గుతున్నాయి. దీని నుంచి బయటకు రాకముందే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందన్న ఐఎండీ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలు వరద ముప్పు నుంచి తేరుకోకముందే అల్పపీడనం రూపంలో మరో గండం వెంటాడుతోంది. ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. రేపు రాష్ట్రమంతటా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. బంగాళాఖాతంలో కొమరిన్ ప్రాంతం, శ్రీలంక తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ. దీంతో అనంతపురం, చిత్తూరు, కడప, నెల్లూరులో హై అలెర్ట్ ప్రకటించారు.

Also Read:

Tomato Prices Falling: ఏపీలో అక్కడ ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర.. కిలో రూ.10 నుంచి రూ.27 మాత్రమే..

అర్ధరాత్రి వరకు మొబైల్‌ స్క్రీన్‌ చూస్తున్నారా.. అయితే ఆ కోరికలు పెరుగుతున్నాయట..!