AP Politics: ఏపీ రాజకీయాల్లో ‘పంచె తంత్రం’.. మళ్లీ ట్రెండ్ అవుతున్న వైఎస్ పంచె కట్టు
అచ్చమైన ఆంధ్రా పంచెకట్టులో జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిన నేత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. వైఎస్ అనగానే ఆయన మార్క్ ఆఫ్ గవర్నెన్స్‌తో పాటు ఆయన పంచె కట్టు కూడా ఠక్కున గుర్తుకొచ్చేది. కానీ.. వైఎస్ పంచె కట్టు ఇప్పుడు మరో కోణంలో ట్రెండ్ అవుతోంది. ఏపీ రాజకీయాల్లో పంచె చుట్టూ పంచులు తాజాగాపేలుతున్నాయి.

అచ్చమైన ఆంధ్రా పంచెకట్టులో జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిన నేత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. వైఎస్ అనగానే ఆయన మార్క్ ఆఫ్ గవర్నెన్స్‌తో పాటు ఆయన పంచె కట్టు కూడా ఠక్కున గుర్తుకొచ్చేది. కానీ.. వైఎస్ పంచె కట్టు ఇప్పుడు మరో కోణంలో ట్రెండ్ అవుతోంది. ఏపీ రాజకీయాల్లో పంచె చుట్టూ పంచులు పేలుతున్నాయిప్పుడు.
ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు.. యువరాజ్యం అధినేతగా కాంగ్రెస్ లీడర్లను ఒక్కరొక్కరినీ చూపిస్తూ.. పంచెలూడదీసి కొట్టాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. ఆ పవర్‌ఫుల్ పంచె డైలాగ్ తర్వాతే సిసలైన ఫైర్ బ్రాండ్ అనే పేరొచ్చింది పవన్‌కి. పవన్ పంచె డైలాగ్‌కు అప్పట్లో చిరంజీవి కూడా కోరస్ ఇచ్చారు.
తర్వాత అటువాళ్లు ఇటు, ఇటువాళ్లు అటు చేరి పార్టీలు మారి.. రాజకీయమంతా కలగాపులగమైపోయింది. కట్‌చేస్తే, పదిహేనేళ్ల కిందటి ఆ మాట ఇప్పుడు మళ్లీ రీసౌండ్ ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వర్సెస్ మంత్రి రోజా ఎపిసోడ్‌లో పంచె డైలాగులు రిపీటయ్యాయి. చంద్రబాబు ఇంటికెళ్లి బొకే ఇచ్చినందుకైనా క్షమించొచ్చు. కానీ, వైఎస్‌ఆర్ పంచెలూడదీసి కొడతానన్న పవన్ కల్యాణ్ కూడా నీ కొడుకు పెళ్లికి చీఫ్ గెస్టుగా రావాలా అని షర్మిలను నిలదీశారు రోజా.
టీడీపీలో ఉండగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మీద నువ్వేసిన పంచ్ డైలాగుల్ని మరిచిపోయావా తల్లీ అంటూ రోజాకు సంబంధించి తనూ ఒక ఫ్లాష్‌బ్యాక్‌ని తవ్వేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇలా.. ఒకటిన్నర దశాబ్దం తర్వాత వైఎస్‌ని, అప్పట్లో ఆయన్ని ఆడిపోసుకున్నవాళ్లను గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు. ఏపీ పొలిటికల్ పిక్చర్‌పై మొదలైన ఈ పంచె తంత్రం ఇక్కడితోనే ఆగుతుందా.. లేక మరిన్ని పంచ్ డైలాగులకు తావిస్తుందా చూడాలి…!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




