AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: తాడిపత్రిలో విగ్రహం పాలిటిక్స్‌ సెగ.. కేతిరెడ్డి- జేసీకి మధ్య రాజుకున్న అగ్గి

AP Politics: తాడిపత్రిలో విగ్రహం పాలిటిక్స్‌ సెగ పుట్టిస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న లోకల్‌ పాలిటిక్స్‌... మరోసారి బుసలు కొడుతున్నాయి. అసలు ఈ రచ్చకు కారణమేంటి?..

AP Politics: తాడిపత్రిలో విగ్రహం పాలిటిక్స్‌ సెగ.. కేతిరెడ్డి- జేసీకి మధ్య రాజుకున్న అగ్గి
Subhash Goud
|

Updated on: Feb 19, 2022 | 11:08 AM

Share

AP Politics: తాడిపత్రిలో విగ్రహం పాలిటిక్స్‌ సెగ పుట్టిస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న లోకల్‌ పాలిటిక్స్‌… మరోసారి బుసలు కొడుతున్నాయి. అసలు ఈ రచ్చకు కారణమేంటి? కేతిరెడ్డికి, జేసీకి మధ్య మళ్లీ ఎందుకు అగ్గి రాజుకుంది? అక్కడ కనిపించే విగ్రహమే. ఇది స్వయానా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. (Kethireddy Peddareddy) తండ్రి రామిరెడ్డి (Ramireddy) విగ్రహం కావడం మరింత రచ్చకు కారణమైంది. ఈ అంశంలో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి (Jc Prabhakar Reddy). ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెద్దారెడ్డి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కారాలు మిరియాలు నూరుతున్నారు జేసీ.

సొంత తండ్రి విగ్రహాన్ని కూడా స్వయంగా విగ్రహావిష్కరణ చేయించలేని దుస్థితిలో పెద్దారెడ్డి ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు ప్రభాకర్‌ రెడ్డి. పెద్దారెడ్డి తండ్రి ఓ అనామకుడనీ.. అలాంటి వ్యక్తికి చెందిన విగ్రహావిష్కరణను.. మరో అనామకుడితో చేయించారని విమర్శించారు. కేతిరెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహానికి సంబంధించి.. తాడిపత్రిలో రాజకీయం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది. గతంలో సమితి ప్రెసిడెంట్‌గా పనిచేసిన రామిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్లాన్‌ చేయడంతోనే ఈ వార్‌ మొదలైంది. అయితే, తాడిపత్రిలో ఐదారు దశాబ్ధాలుగా మా ఫ్యామిలీదే రాజ్యం.. మా తండ్రి ఫ్రీడమ్ ఫైటర్.. ఎన్నో పదవుల్ని అలంకరించారు. అలాంటి మా నాయనకే విగ్రహాం పెట్టలేదు.. మీ నాయనకి అవసరమా? అనేది జేసీవాదన. అంతేకాదు, విగ్రహాల ఏర్పాటుపై సుప్రీం కోర్టు స్పష్టమైన డైరెక్షన్స్‌ ఇచ్చిందనీ చెబుతున్నారు ప్రభాకర్‌ రెడ్డి. ఇంతలోనే విగ్రహావిష్కరణ జరగడం.. జేసీలో మరింత కోపాన్ని పెంచింది.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. తాడిపత్రి-అనంతపురం ప్రధాన రహదారిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఎదురుగా రామిరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై విగ్రహాలు ఉండరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తున్న జేసీ.. ఈ విషయాన్ని కలెక్టర్‌ దాకా తీసుకెళ్లారు. అయినా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ ఇష్యూ ఇంతటితో ఆగుతుందా? మరింత వేడెక్కుతుందా? అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి:

PM Modi: ఎన్నికలకు ముందు సిక్కులతో ప్రధాని మోడీ సమావేశం.. వ్యూహం ఫలించేనా..?

Telangana Politics: బీజేపీలో ఆ సీటు చాలా హాటు గురూ.. మరి ఎందుకంత ప్రత్యేకమో ఈ కథనంలో తెలుసుకోండి..