AP Police Constable Exam: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్.. ఒక్కనిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ఇవాళ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్ష ఇవాళ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభమయ్యే పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అయితే, అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్‌లోకి అనుమతివ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది.
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమనరీ పరీక్ష కోసం బోర్డు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించింది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు.. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్ జరగనుంది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
- అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
- 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు.
- మొబైల్ ఫోన్, సెల్యూలార్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాల, రికార్డింగ్ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
- అభ్యర్థుల వస్తువులను భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.
- అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి.
- హాల్‌టికెట్ తప్పనిసరి. బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తీసుకురావాలి.
అభ్యర్థులు ముందుగానే తమ పరీక్షకేంద్రానికి చేరుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.