AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..! పూర్తి సమాచారం కోరుతూ డీజీపీ లేఖ..

టీడీపీ లీడర్ నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదంటూ ప్రచారం జరుగుతుంది.

Nara Lokesh: నారా లోకేష్ యువగళం పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..! పూర్తి సమాచారం కోరుతూ డీజీపీ లేఖ..
Nara Lokesh
Shaik Madar Saheb
|

Updated on: Jan 22, 2023 | 8:12 AM

Share

టీడీపీ లీడర్ నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతి ఇవ్వలేదంటూ ప్రచారం జరుగుతుంది. యువగళం యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. లేఖలు రాసినా డీజీపీ స్పందించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అనుమతిచ్చినా.. ఇవ్వకపోయినా పాదయాత్ర మాత్రం జరిగి తీరుతుందని తెలుగుదేశం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ సైతం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. మూడున్నరేళ్లుగా ఓ సైకో పై పోరాడుతున్నామని, తెలుగుదేశం పార్టీకి అధికారం, ప్రతిపక్షం కొత్త కాదన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత సైకో పాలన చూడలేదని ఫైర్ అయ్యారు. ప్రజలంతా ఎన్నో ఆశలతో జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చారని, కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని లోకేశ్ విరుచుకుపడ్డారు. పాదయాత్ర తప్పనిసరిగా జరిగి తీరుతుందని స్పష్టంచేశారు.

27 నుంచి ప్రారంభమయ్యే యువగళం పాదయాత్రపై ఏపీలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కగా.. పాదయాత్ర అనుమతిపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ డీజీపీ కోరడం చర్చనీయాంశంగా మారింది. 400 రోజుల పాదయాత్ర వివరాలూ ముందుగానే ఇవ్వాలంటూ డీజీపీ వర్ల రామయ్యకు లేఖ రాశారు. పాదయాత్రలో పాల్గొనే వారి సంఖ్యతో పాటు వారి పూర్తి వివరాలు ముందే ఇవ్వాలంటూ సూచించారు. వచ్చే 400 రోజుల్లో ఎప్పుడు ఏగ్రామంలో తిరుగుతారో, ఎక్కడెక్కడ బస చేస్తారో పూర్తి వివరాలు చెప్పాలని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. గతంలో జరిగిన పాదయాత్రలను ప్రస్తావిస్తూ డీజీపీ లేఖకు వర్ల రామయ్య బదులిచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి,జగన్ చేసిన పాదయాత్రల సమయంలో ఇలాంటి సమాచారం ఎవరూ కోరలేదంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆయా రోజుల్లో ఎంత మంది వస్తారనేది అంచనా వేసి బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ తో పాటు అన్ని వివరాలు స్థానిక పోలీసులతో ఎప్పటికప్పుడు పంచుకుంటామన్నారు. అన్ని వివరాలు ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులు అధికారులకు అందించడానికి సిద్దంగా ఉన్నామని.. రామయ్య డీజీపీకి వివరించారు.

మరన్ని ఏపీ వార్తల కోసం..