Viral Video: చిట్టడవిలో అంతుచిక్కని రహస్యం.. చెట్టులోంచి ఏకధాటిగా వస్తోన్న నీరు..

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఓ వింత ఘటన కలకలం రేపుతోంది. చిట్టడవిలో చెట్టులోనుంచి ఏకధాటిగా ఉబికి వస్తోన్న నీటి ధర స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

Viral Video: చిట్టడవిలో అంతుచిక్కని రహస్యం.. చెట్టులోంచి ఏకధాటిగా వస్తోన్న నీరు..
Water From Tree
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 22, 2023 | 11:04 AM

అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఓ వింత ఘటన కలకలం రేపుతోంది. చిట్టడవిలో చెట్టులోనుంచి ఏకధాటిగా ఉబికి వస్తోన్న నీటి ధర స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్ళిన ఓ యువకుడి కంట బడ్డ ఈ దృశ్యం జనంలో అలజడి సృష్టించింది. ఓ చెట్టులో నుంచి నీరు ఏకధాటిగా బయటకు చిమ్ముతుండడం ఆశ్చర్యానికి గురిచేసింది. కూనవరం మండలం గొమ్ముగూడెం పంచాయతీలోని కుమారస్వామి గూడెం అటవీ ప్రాంతంలో ఈ వింత ఘటన జరిగింది.

గొమ్ముగుడెం అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టే ప్రయత్నంలో ఓ యువకుడు కత్తి తో చెట్టును నరకడంతో కత్తి తాకిన చోటనుంచి ఉన్నట్టుండి నీరు ఉబికి రావడం మొదలైంది. చుట్టూ చెట్లు తప్ప పెద్దగా మనుషులు తిరగని ప్రాంతం కావడంతో భయపడ్డ ఆ యువకులు దగ్గర్లోని గొమ్ముగూడెం గ్రామస్తులకు విషయం తెలియజేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు అడవిలో వింతని చూసి అవాక్కయ్యారు. చెట్టునుంచి నీరు ఎందుకొచ్చిందో తెలియక ఆశ్చర్యానికి గురౌతున్నారు.

ఇవి కూడా చదవండి

మద్ది చెట్టు నుంచి ఉబికి వస్తున్న నీరు..

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..