AP Temple Politics: ఏపీలో పార్టీస్‌ వర్సెస్‌ పోలీస్‌గా టెంపుల్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుకు డీజీపీ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయ రాజకీయాలు పార్టీల మధ్య నుంచి క్రమంగా పార్టీలు వర్సెస్‌ పోలీసులుగా మారాయి. ఆలయాలపై దాడులు, దేవతా మూర్తుల ధ్వంసం..

AP Temple Politics: ఏపీలో పార్టీస్‌ వర్సెస్‌ పోలీస్‌గా టెంపుల్‌ పాలిటిక్స్‌.. చంద్రబాబుకు డీజీపీ వార్నింగ్
Follow us
K Sammaiah

|

Updated on: Jan 22, 2021 | 12:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయ రాజకీయాలు పార్టీల మధ్య నుంచి క్రమంగా పార్టీలు వర్సెస్‌ పోలీసులుగా మారాయి. ఆలయాలపై దాడులు, దేవతా మూర్తుల ధ్వంసం వెనుక టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉందంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన సంచలన ప్రకటనతో ఆ పార్టీలు డీజీపీపై గుర్రుగా ఉన్నాయి. అధికార, విపక్షాల మధ్య వివాదం కాస్త పోలీస్ వర్సెస్ పార్టీస్‌గా మారింది. డీజీపీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.

ఏపీలో ఆలయాలపై దాడులకు సంబంధించి మొత్తం 44 ఘటనలు జరిగితే 29 కేసులను పోలీసులు చేధించారు. వాటిలో 9 ఘటనలకు రాజకీయ నేపథ్యం ఉందని డీజీపీ ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీ, బీజేపీ నేతలు డీజీపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలంటూ.. డెడ్‌లైన్ విధించిన కమలనాథులు..డీజీపీ ఆఫీస్‌ ముట్టడికి యత్నించారు. ఇది కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇక ఈ నెల రెండో తేదీన రామతీర్థం పర్యటనకు చంద్రబాబుకు అనుమతించిన పోలీసులు.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా అనుమతిచ్చారు. ఈ క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. విజయసాయిరెడ్డి వాహనంపై దాడి జరిగింది. ఈ క్రమంలో పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టారు. అధికార పార్టీకి అనుకూలంగా డీజీపీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సంగతేమో కానీ.. చంద్రబాబు విషయంలో సీరియస్‌గా ఉన్నారు డీజీపీ. రాజ్యాంగ బద్ధంగా… ఇండియల్‌ సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌కు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్న తమకు మతాన్ని, కులాన్ని అంటగడుతూ విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. చర్యలు తప్పదంటూ హెచ్చరించారు.