Andhra Pradesh: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు.. రెండు గంటలపాటు కదల్లేక.. మెదల్లేక..
అది తాడేపల్లి నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గం. ఎప్పుడు చిన్న చిన్న ఆటోలు, బస్సులు, మినీ వ్యాన్లు ఆ రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. హెవీ వెహికల్స్ ఆ రోడ్డులోకి రావడం స్థానికులు ఇంతవరకూ చూడలేదు. ఎందుకంటే అక్కడ రైల్వే అండర్ పాస్ ఉంది. దీంతో ఆ మార్గం గుండా హెవీ వెహికల్స్ రావడం జరగదు. అయితే మంగళవారం మధ్యాహ్న సమయంలో ఒక హెవీ లారీ వచ్చింది. లారీలో ఎరువుల బస్తాలున్నాయి. అండర్ పాస్ నుంచి లారీని పోనిచ్చే ప్రయత్నం చేశాడు లారీ..

గుంటూరు, అక్టోబర్ 10: అది తాడేపల్లి నుంచి జాతీయ రహదారికి వెళ్లే మార్గం. ఎప్పుడు చిన్న చిన్న ఆటోలు, బస్సులు, మినీ వ్యాన్లు ఆ రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. హెవీ వెహికల్స్ ఆ రోడ్డులోకి రావడం స్థానికులు ఇంతవరకూ చూడలేదు. ఎందుకంటే అక్కడ రైల్వే అండర్ పాస్ ఉంది. దీంతో ఆ మార్గం గుండా హెవీ వెహికల్స్ రావడం జరగదు. అయితే మంగళవారం మధ్యాహ్న సమయంలో ఒక హెవీ లారీ వచ్చింది. లారీలో ఎరువుల బస్తాలున్నాయి. అండర్ పాస్ నుంచి లారీని పోనిచ్చే ప్రయత్నం చేశాడు లారీ డ్రైవర్. దీంతో ఒక్కసారిగా లారీ భారికేడ్స్‌ను ఢీ కొట్టి ట్రాక్ కింద నిలిచిపోయింది. ముందుకు, వెనక్కు కదలకపోవటంతో అటుగా వెళ్లే వాహనాలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.
చెన్నై, విజయవాడ వెళ్లే ప్రధాన రైలు మార్గం కావడంతో ట్రాక్ కింద హెవీ లోడ్ తో ఉన్న లారీ ఇరుక్కుపోవడంతో అధికారులు హైరానా పడ్డారు. మరోవైపు ఆ మార్గం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేది కావటంతో మరింత కంగారు పడ్డారు. ఒకానొక దశలో లారీని తొలగించేందుకు పెద్ద క్రేన్‌ను తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. బారీ కేడ్‌ను ఢీకొట్టిన సమయంలో పెద్ద ఇనుమ్మ కమ్మె విరిగిపోయి లారీపై పడింది. దీంతో లారీని కదిలించడం కూడా సాధ్యం కాలేదు. అయితే క్రేన్ సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే లారీలో ఉన్న ఎరువుల బస్తాలు పగిలిపోయి ఎరువులు రోడ్డు మీద కారిపోయాయి. అదే సమయంలో గూడ్స్ రైలు రావడంతో కొద్దీ సేపు రైలును నిలిపి వేశారు.
రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన లారీ వీడియో
దాదాపు రెండు గంటల ప్రయత్నం తర్వాత ట్రాక్ కింద ఇరుక్కుపోయిన లారీని తీయగలిగారు. ట్రాక్ కు ఎటువంటి డ్యామేజ్ కాకుండానే లారీని తీయడంతో అటు రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.