AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..
AP MPTC ZPTC Elections Result Updates: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 206 కేంద్రాల్లో కౌంటింగ్
AP MPTC ZPTC Elections Result Updates: ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కించడానికి 32 వేల 264 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. మరో 11 వేల 803 మందిని కౌంటింగ్ సూపర్‌వైజర్స్‌గా నియమించింది ఎస్‌ఈసీ. వీళ్లతో పాటు జిల్లాకో ప్రత్యేక అధికారి ఉన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర సీసీ కెమెరా నిఘాతో పాటు భారీ భద్రత పెట్టారు. కోవిడ్ ప్రోటోకాల్ మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు, సాయంత్రం నాటికి జడ్పీటీసీ ఫలితాలు వెలువడే అవకాశముంది.
ఎంపీటీసీ స్థానాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్ధానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది మార్చి7న ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొత్తం 9672 స్ధానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2,371 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్ధానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న.. 7220 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
జడ్పీటీసీ స్థానాలు ఇలా.. ఏపీలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. ఇందులో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి7న 652 స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చివరికి ఈ ఏడాది ఏప్రిల్ 8న.. 515 స్ధానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో మొత్తం 2058 అభ్యర్ధులు పోటీ చేశారు. ఇప్పుడు వీరందరి భవితవ్యం ఈ రోజు తేలనుంది.
Also Read: