చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యుల నివేదిక.. చర్మ సమస్యపై కీలక అంశాలు వెల్లడి
చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు ఉన్నాయని, చంద్రబాబుకు స్కిన్ అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని డాక్టర్లు తమ నివేదికలో తెలిపారు. చంద్రబాబు గడ్డంపై, అరచేతి భాగాల్లో, ఛాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో దద్దుర్లు ఉన్నాయని నివేదికలో తెలిపారు. చంద్రబాబు చర్మం రంగుమారినట్లుగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నివేదిక వెల్లడించింది.

Chandrababu Naidu Arrest: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నివేదిక బయటకు వచ్చింది. చంద్రబాబుకు డేర్మటాలజీ సమస్య ఎక్కువగా ఉందని డాక్టర్లు తమ నివేదికలో తెలిపారు. చంద్రబాబు చేతులు, మొహంతో పాటు ఇతర శరీర భాగాల్లో దద్దుర్లు ఉన్నాయని, చంద్రబాబుకు స్కిన్ అలెర్జీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని డాక్టర్లు తమ నివేదికలో తెలిపారు. చంద్రబాబు గడ్డంపై, అరచేతి భాగాల్లో, ఛాతి భాగంలో, శరీరంలోని పలు భాగాల్లో దద్దుర్లు ఉన్నాయని నివేదికలో తెలిపారు. చంద్రబాబు చర్మం రంగుమారినట్లుగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నివేదిక వెల్లడించింది.
మరోవైపు ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం వైద్యులు మెకనాజల్ రిఫర్ చేశారు. అరచేతుల కోసం మార్చురెక్స్ సాఫ్ట్ క్రీమ్ రిఫర్ చేశారు. అలెర్జీ కోసం టెక్జిన్ రిఫర్ చేశారు. ఇమ్యూనిటీ పెంపు కోసం లిమ్సీ ట్యాబ్లెట్స్ రిఫర్ చేశారు. ఎండల కారణంగా బాబు డిహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నారని, స్కిన్ సమస్యలు మళ్లీ రాకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని డాక్టర్లు సూచించారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగాలేదని డ్రామా- మంత్రి బొత్స
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగోలేదని కొత్త డ్రామా ఆడుతున్నారని ఏపీ మంత్రి బొత్స ఆరోపించారు. ఏమైనా ఇబ్బందులుంటే కోర్టుకు విన్నవించుకోవాలని సూచించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అధికారులు నడుచుకుంటారని చెప్పారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కేసు పెట్టారని అన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఆరోగ్యం బాగోలేదని చంద్రబాబు కోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేదని బొత్స ప్రశ్నించారు. తప్పు చేయకపోతే చంద్రబాబును ఎందుకు జైల్లో పెడుతారని ప్రశ్నించారు. బెయిల్ కోసం బాబు ప్రయత్నించినట్టు కూడా కనిపించడం లేదని బొత్స అన్నారు.
కాగా చంద్రబాబు నాయుడు చర్మ సమస్యలతో బాధపడుతున్నారన్న వైద్యుల నివేదికతో చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ములాఖాత్‌లో భాగంగా చంద్రబాబును నేడు నారా లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి కలుసుకున్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..