AP Inter: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు వచ్చేశాయ్.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ విషయమై ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు అధికారిక ప్రకటన చేశారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా...

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ విషయమై ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు అధికారిక ప్రకటన చేశారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్, రిసిప్ట్ నెంబర్ వంటి వివరాలను అందించడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇందులో ఏమైనా ఇమైనా ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 18004257635కి సంప్రదించాలని తెలిపారు.
ఇదిలా ఉంటే ఉంటే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 26వ తేదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది 4 లక్షల 84వేల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్, 5లక్షల 19వేల మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2,66,322 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ విషయానికొస్తే మొత్తం 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించిన విషయం విధితమే.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. అనంతరం హోం పేజీలో కనిపించే రీకౌంటింగ్, రీవెరిఫకేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో విద్యార్థులు రూల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రశీదు నెంబరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి ‘రిజల్ట్స్’ బటన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు వచ్చేస్తాయ్.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి…