AP ICET 2023 Results: మరికాసేపట్లో విడుదలకానున్న ఏపీ ఐసెట్ ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్ చేసుకోండి..
ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్) ప్రవేశ పరీక్ష ఫలితాలు (బుధవారం) మరికాసేపట్లో విడుదలకానున్నాయి. మే 24 తేదీన ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు..
AP ICET 2023 Result Date: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్) ప్రవేశ పరీక్ష ఫలితాలు (బుధవారం) మరికాసేపట్లో విడుదలకానున్నాయి. మే 24 తేదీన ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఏపీలో 109, తెలంగాణలో రెండు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. ఐసెట్ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,162 మంది దరఖాస్తుకోగా.. దాదాపు 44 వేల మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఎస్కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి బుధవారం విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్ లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
కాగా ఐసెట్-2023లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.