AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court: ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌పై హైకోర్టులో విచారణ.. డివిజన్ బెంచ్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ!

ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కౌంటింగ్‌పై ఇవాళ ఓ క్లారిటీ రానుంది. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

AP High Court: ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్‌పై హైకోర్టులో విచారణ.. డివిజన్ బెంచ్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ!
Ap High Court
Balaraju Goud
|

Updated on: Jun 24, 2021 | 9:58 AM

Share

AP High Court on ZPTC MPTC Election Counting: ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కౌంటింగ్‌పై ఇవాళ ఓ క్లారిటీ రానుంది. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎల‌క్షన్ కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్ట్‌ ఆదేశాలకు విరుద్ధంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి.. ఏప్రిల్ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ దాఖలు చేసింది.

అయితే, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేసిన ఏపీ హైకోర్ట్‌.. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్‌ జడ్జికి అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపైనా సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పును వెలువరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో సుప్రీం ఆదేశాలు పాటించలేదని కౌంటింగ్ రద్దు చేసి కొత్తగా ఎన్నికలు జరపాలని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఎన్నికల రద్దును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

కాగా, వారం రోజుల క్రితం డిలే పిటిషన్ దాఖలు చేసిన ఎసీఈసీ.. నిన్న పూర్తి స్థాయి పిటిషన్ ఫైల్ చేసింది. ఇవాళ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. హైకోర్టు ఇచ్చే తీర్పుతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పై క్లారిటీ రానుంది. ఇదే సందర్భంలో డివిజన్ బెంచ్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Read Also… KRMB on RDS Project: తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి ఆదేశం