AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Water Dispute: తారాస్థాయికి కృష్ణా జలాల వివాదం.. తెలంగాణను కట్టడి చేయాలంటూ ఏపీ లేఖ

AP - KRMB: కృష్ణా జలాల వాడకం విషయంలో తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వాడకం విషయంలో

Krishna Water Dispute: తారాస్థాయికి కృష్ణా జలాల వివాదం.. తెలంగాణను కట్టడి చేయాలంటూ ఏపీ లేఖ
Krmb
Shaik Madar Saheb
|

Updated on: Apr 05, 2022 | 12:38 PM

Share

AP – KRMB: కృష్ణా జలాల వాడకం విషయంలో తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ (Telangana) ప్రభుత్వాల మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. నదీ జలాల వాటా విషయంలో వివాదం రెండు రాష్ట్రాల మధ్య తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తాజాగా కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం – కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడం మరో వివాదంగా మారనుంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌ జలాలను తెలంగాణ ప్రభుత్వం వినియోగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ ఛీప్‌ సి.నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. గతేడాది వర్షాకాలం ప్రారంభం కాకముందే నాగార్జున సాగర్‌ నుంచి నీటిని తరచూ విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించడం వలన పులిచింతల ప్రాజెక్టులో స్పిల్‌ వే రేడియల్‌ గేట్లను తెరవడం, మూయడం చేయాల్సి వచ్చిందని ఈ లేఖలో పేర్కొన్నారు.

ఈ కారణంగా స్పిల్‌ వే గేట్‌ నెంబర్ 16 కొట్టుకుపోయిందని తెలిపారు. ఆ గేటును ఇప్పటికీ అమర్చలేదని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం నీటిని విడుదల చేస్తూ పోతే పులిచింతల రిజర్వాయర్‌ పూర్తి స్థాయి మట్టానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికంగా వచ్చే నీటిని ప్రకాశం బ్యారెజీకి విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తుందని ENC తన లేఖలో రాశారు. ఇప్పటికే ప్రకాశం బ్యారెజ్‌ నిండుగా ఉందని, ఎగువ నుంచి వచ్చే నీరు సముద్రం పాలవుతుందని అన్నారు.

అంతే కాదు, ఈ వేసవిలో నాగార్జున సాగర్‌ పరిధిలో తాగునీటి కోసం తీవ్రమైన డిమాండ్‌ ఉంటుందని, ఈ కారణంగా అమూల్యమైన నీటిని పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. అటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి – కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో భేటీ కానున్నారు. ఆయనతో సమావేశం సందర్భంగా నదీ జలాల విషయం ప్రస్తావనకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read:

AP Cabinet: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. కాబోయే కొత్త మంత్రులు వీరే..? లిస్ట్ వైరల్..!

AP New Districts: ఏపీలో త్వరలో మరో కొత్త జిల్లా.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..