Krishna Water War: విభజన చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోంది .. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో AP పిటిషన్
తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయితీ సర్వోన్నత న్యాయస్థానంకు చేరింది. కృష్ణా జలాలు, ప్రాజెక్ట్‌ల అంశంలో తెలంగాణ వైఖరిని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్...
తెలుగు రాష్ట్రాల నీళ్ల పంచాయితీ సర్వోన్నత న్యాయస్థానంకు చేరింది. కృష్ణా జలాలు, ప్రాజెక్ట్‌ల అంశంలో తెలంగాణ వైఖరిని తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సర్కార్. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రాజెక్ట్‌లను వెంటనే బోర్డు పరిధిలోకి తేవాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం చట్టాలు ఉల్లంఘించి, రాజ్యాంగ సమస్య సృష్టిస్తోందని ఏపీ ఆరోపించింది. చట్టపరంగా ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను దక్కకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని పిటిషన్‌లో పేర్కొంది.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నడుచుకోవడం లేదని ఆరోపించింది ఏపీ సర్కారు. పరిధులను నోటిఫై చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నియంత్రణ ఉండాలని పేర్కొంది.
ప్రాజెక్ట్‌ల దగ్గర CISF భద్రత కల్పించాలని పేర్కొంది. దిగువ రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతీసే విధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని, సాగు, తాగునీటి అవసరాలకు కాదని విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, దీని నిలువరించాలని కోరింది. విభజన చట్టాన్ని తెలంగాణ ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. కృష్ణా బోర్డుకు, కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కాబట్టే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్న వాదన చేస్తోంది ఏపీ.