AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కూటమి ప్రభుత్వానికి నేటితో 100 రోజులు.. ‘మంచి ప్రభుత్వం’ పేరుతో

ఇక రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై నేటితో వంద రోజులు పూర్తయిన తరుణంలో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో ఇంటింటికీ ప్రచారం చేపట్టనుంది. 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు వారంరోజుల పాటు 'ఇది మంచి ప్రభుత్వం' పేరుతో గ్రామ, వార్డు స్థాయిలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం..

Andhra Pradesh: కూటమి ప్రభుత్వానికి నేటితో 100 రోజులు.. 'మంచి ప్రభుత్వం' పేరుతో
Ap Govt
Narender Vaitla
|

Updated on: Sep 20, 2024 | 6:50 AM

Share

రాష్ట్రంలో టిడిపి ఆధ్వర్యంలోని జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తయింది. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాక్టర్‌, బీజేపీపై సానుకూలత, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం.. వైసీపీపై వ్యతిరేకత ఇలా కారణం ఏదైనా ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున ఆశలు ఉన్నాయి. రాజధాని అమరావతి మొదలు, ఉపాధి అవకాశాల వరకు అన్ని విషయాల్లో మార్పును కోరుకున్నారు ఏపీ ప్రజలు. అందుకే కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు.

ఇక రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై నేటితో వంద రోజులు పూర్తయిన తరుణంలో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ఇంటింటికీ ప్రచారం చేపట్టనుంది. 100 రోజుల్లో సాధించిన విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు వారంరోజుల పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో గ్రామ, వార్డు స్థాయిలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపల్లి గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలుచేసిన ముఖ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఎమ్మెల్యేలు అందరూ కచ్చితంగా తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ అదిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్లు నోడల్ అధికారిగా, మండల, పుర, నగరపాలక సంస్థల్లో ఎంపీడీఓలు, కమిషనర్లు పర్యవేక్షక అధికారులుగా బాధ్యతలు ఇచ్చారు. ఇక ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ పోస్టింగ్‌ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..