Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తూచ్.. తొందరపడి హామీ ఇచ్చాం.. సర్ధుకుపోండి.. ఉద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ రిక్వెస్ట్..

ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని స్థానంలో కొత్త విధానం జీపీఎస్‌ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సెప్టెంబర్ 7వ తేదీ..

Andhra Pradesh: తూచ్.. తొందరపడి హామీ ఇచ్చాం.. సర్ధుకుపోండి.. ఉద్యోగులకు మంత్రి బొత్స సత్యనారాయణ రిక్వెస్ట్..
Botsa Satyanarayana
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 08, 2022 | 1:40 PM

Andhra Pradesh: ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని స్థానంలో కొత్త విధానం జీపీఎస్‌ అంశంపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం సమావేశమైంది. అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. జీపీఎస్ (GPS) పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని, ఫైనల్ డ్రాఫ్ట్ ను ఉద్యోగులకు వివరించామన్నారు. రిటైర్ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10,000 పెన్షన్ ఉండేలా చూస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చామని తెలిపారు. పెన్షనర్ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్ ఇస్తామన్నారు. పెన్షనర్లకు హెల్త్ కార్ఫ్ కూడా పెట్టామని, పెన్షనర్ చనిపోతే ఎక్సగ్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామని.. జీపీఎస్ ఫైనల్ అయ్యాక. చట్ట బద్ధత కల్పిస్తామని తెలిపారు. జీపీఎస్‌ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి పేర్రొన్నారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కంటే మెరుగైన పథకాన్ని తీసుకురావాలనే ఆలోచనతో జీపీఎస్ ను తెచ్చామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జీపీఎస్‌లోనూ మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల ముందు సీపీఎస్‌ రద్దుపై తొందరపడి హమీ ఇచ్చామని. మేనిఫెస్టోలో పేర్కొన్న 95శాతం హామీలు నెరవేర్చామని  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ చెప్పారు. నెరవేర్చని 5శాతం హామీల్లో సీపీఎస్‌ రద్దు కూడా ఉందని అన్నారు. ఇంకా ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే మేమేం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారని, తీవ్రమైన కేసులు పెట్టిన వాటిపై సీఎం దగ్గరకు తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఉద్యోగులపై పెట్టిన కఠిన కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులతో చెప్పామని తెలిపారు. కాగా.. జీపీఎస్‌ను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసమావేశానికి ఏపీజేఏసీ అమరావతి, ఏపీ సీపీఎస్‌ యూఎస్‌ (AP CPS US), ఏపీ సీపీఎస్‌ ఈఏ (AP CPS EA) సంఘాలు దూరంగా ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి