Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కేబినెట్ లో కీలక నిర్ణయాలు.. ఈ నెల 22న వైఎస్ఆర్ చేయూత.. సీఆర్డీఏ చట్టంలో మార్పులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 45-60 సంవత్సరాల వయసున్న మహిళకు మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయాలని...

Andhra Pradesh: కేబినెట్ లో కీలక నిర్ణయాలు.. ఈ నెల 22న వైఎస్ఆర్ చేయూత.. సీఆర్డీఏ చట్టంలో మార్పులు
Andhra Pradesh Cabinet
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 07, 2022 | 6:20 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 45-60 సంవత్సరాల వయసున్న మహిళకు మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈనెల 22న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ స్కీమ్ కు రూ.4700 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం (Cabinet) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుకు రూ.4020 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం లభించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ర్యాటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. వీటితో పాటు గ్రామ సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయించేందుకు అంగీకరించారు. గ్రేటర్ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణం, 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయింపు, వర్సిటీలో అధ్యాపకుల కోసం నెట్‌ పాస్ నిబంధన, పాణ్యంలో డిగ్రీ కళాశాల మంజూరు, పాడేరు గిరిజన వర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ వర్సిటీలో 80 మంది రెగ్యులర్, 48 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. మున్సిపల్ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం, సీఆర్డీఏ అభివృద్ధికి రూ.1600 కోట్ల రుణానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ, సీఆర్‌డీఏ చట్టంలోని ఓ క్లాజ్‌లో మార్పులు చేశారు.

కాగా.. రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. అదనంగా 20 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 175 మంది ఖైదీలకు క్షమాబిక్ష పేరుతో విడుదల చేయనున్నారు. గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడులు, 21 వేల ఉద్యోగాలు, ఆర్‌ అండ్ బీలో ఆర్కిటెక్‌ విభాగానికి 8 పోస్టుల మంజూరు, దివ్యాంగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణ, సచివాలయంలో 85 అదనపు పోస్టులు, ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీలు, పైడిపాలెం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం లభించింది.

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్